Jr Ntr: గెలిచి నిలిచాకే.. తారక రాముడు ‘నందమూరి’ వారసుడు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 19 May 2020

Jr Ntr: గెలిచి నిలిచాకే.. తారక రాముడు ‘నందమూరి’ వారసుడు

నిజమే నటనకు ప్రాణం పోస్తే అదిగో అది ఎన్టీఆర్ మాదిరే ఉంటుంది. అతన్ని చూస్తే కెమెరా కోసమే పుట్టాడా అనిపిస్తుంది. తాత పేరే కాదు.. అచ్చుగుద్దినట్లు పోలికలు తాతవే. నాటి ఎన్టీఆర్ కీర్తికి కొనసాగింపు జూనియర్ ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు. నిజంగా ఆయన టైగరే, ఆయన ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అతన్ని చూసి నేర్చుకోరా.. అని నాగార్జున లాంటి సీనియర్ హీరో ప్రేక్షకుల సాక్షిగా అఖిల్‌కి ఆర్డర్ వేశారంటే నటనలో ఎన్టీఆర్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువతో ట్విట్టర్ దద్దరిల్లుతోంది. 12 మిలియన్లకు పైగా ట్వీట్స్‌తో నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉన్నారు ఎన్టీఆర్. కష్టం అంటే తెలిసి.. కష్టాలను ఎదురొడ్డి నిలిచిన ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ.. ఆయన లైఫ్‌లో ఎదుర్కొన్న రియల్ స్ట్రగుల్స్‌‌పై ఓ లుక్కేద్దాం..

తాత ఎన్టీఆర్ నట సార్వభౌముడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే టార్చ్ బేరర్ ఆయన. అలాంటి కుటుంబం నుంచి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే అతని ప్రయాణం నల్లేరుపై నడకే అనుకోవచ్చు కాని.. ఎన్టీఆర్ బ్యాగ్రౌండ్ ఉపయోగడింది.. నటుడిగా తనని తాను నిరూపించుకుని నిలదొక్కున్న తరువాత మాత్రమే. పెద్ద వంశం... నట వారసుడు ఇవి చెప్పుకోవడానికే కాని.. ఎన్టీఆర్ శ్రమకు అండగా నిలిబడలేకపోయాయి. తాత ఉండి ఉంటే పరిస్థితి వేరులా ఉండేదేమో కాని.. ‘నందమూరి’ అనే బ్యాగ్రౌండ్ కొన్నాళ్లవరకూ టైటిల్ కార్డ్‌గా మాత్రమే ఉపయోగపడింది. బ్యాగ్రౌండ్ ఉన్నా.. తారక మంత్రం జపించాల్సిందే అని ఎన్టీఆర్ ముందు పసిగట్టారు.

కష్టం, కఠోర శ్రమకు అద్దం పట్టిన ఎన్టీఆర్ ఈరోజు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నారంటే ఒకప్పుడు ఒకరిగా పోరాటం చేసినందుకే. ఎన్నో అవమానాలు, మరెన్నో వేదనలు.. అందరూ ఉన్నా ఆ అందరిలో ఒకడు కావడానికి ఎన్టీఆర్‌కి చాలా ఏళ్లు పట్టింది. నటుడిగా ఎన్టీఆర్‌కి అసలు సిసలు వారసుడు ఈ తారకరాముడే అని జనం నుంచి గళం వినిపించడంతో ఇప్పుడు నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అయ్యాడు. బాబాయ్ మనసు గెలిచి నిలిచాడు.

బాల నటుడిగా ‘బాల రామయణం’ చిత్రంతో కెరియర్ మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఎన్టీఆర్‌ని ఇతను కూడా నట వారసుల బాపతే అని హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ అంటే అటొచ్చి ఇటెళ్లే బాపతు కాదని తన రెండో సినిమా ‘స్టూడెంట్ నెం.1’తో నిరూపించాడు. రాజమౌళి దర్శకత్వంలో తొలి హిట్ అందుకున్న ఎన్టీఆర్.. తరువాత వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ సినిమాతో తనలోని కసిని చూపించారు. తొడకొట్టి మరీ బాక్సాఫీస్ ఆది చిత్రంతో శాసించాడు. అనంతరం తిరిగి మళ్లీ రాజమౌళి ‘సింహాద్రి’ సినిమా ద్వారా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోలకు పోటీ అయ్యాడు.

ఎన్టీఆర్ తొడకొడితే థియేటర్స్ దద్దరిల్లేవి.. ఎంతో కష్ట సాధ్యమైన మాస్ ఇమేజ్‌ని అతి చిన్న వయసులోనే సాధించగలిగారు ఎన్టీఆర్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గా తాతకు తగ్గ మనువడే కాదు.. డాన్స్, యాక్షన్ సీన్స్ విషయంలో తాతను మించే అని మైమరపించాడు. సింహాద్రి చిత్రం తరువాత కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న ఎన్టీఆర్.. తిరిగి తన రాజమౌళితో ‘యమదొంగ’ మరో హిట్ అందుకున్నారు. అనంతరం ‘అదుర్స్’, బృందావ‌నం, బాద్‌షా, టెంప‌ర్, నాన్నకు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్, జైల‌వ‌కుశ‌, అర‌వింద స‌మేత’ వంటి హిట్లతో ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు. అయితే అన్ని సినిమా ఒక లెక్క.. త్వరలో రాబోయే ఆర్ ఆర్ ఆర్ మరో లెక్క అన్న మాదిరిగా తన స్నేహితుడు, స్టార్ హీరో రామ్ చరణ్‌తో కలిసి RRR చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నారు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ నందమూరి వారసుడు 2011లో మే 5న నార్నె వారి ఇంటికి అల్లుడయ్యాడు. లక్ష్మీ ప్రణీతను వివాహం చేసుకున్న ఎన్టీఆర్‌‌కి అభయ్ రామ్, భార్గవ రామ్ ఇద్దరు కొడుకులు సంతానం. షూటింగ్‌లను పక్కనపెడితే తన భార్య,పిల్లలతో ఎక్కువ టైం కేటాయించడానికి ఇష్టపడతాడు ఎన్టీఆర్. తనని ఎంతో ప్రేమించే తండ్రి హరిక్రిష్ణ చనిపోవడంతో కొన్నాళ్ల పాటు మానసిక వేదనకు గురయ్యారు ఎన్టీఆర్. సినిమా ఫంక్షన్లలో సైతం తండ్రి గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుని విలపించారు ఎన్టీఆర్.

వెండితెరపై యంగ్ టైగర్‌గా బాక్సాఫీస్‌ని శాసించిన ఎన్టీఆర్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో బుల్లితెరపై జెండా పాతేశారు. బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్‌గా వ్యవహరించి.. తెలుగు టీవీ చరిత్రలో ఎప్పుడూలేనంత టీఆర్‌పీ రేటింగ్ ‘బిగ్ బాస్’కు వచ్చేలా చేశారు. తన మాటతీరు, వ్యాక్చాతుర్యంతో బిగ్ బాస్ ఆటను వన్ మ్యాన్ షోగా నడిపించారు ఎన్టీఆర్. ఆ తరువాత బిగ్ బాస్ రెండు సీజన్లు వచ్చినప్పటికీ.. ఎన్టీఆర్ స్థాయిలో హోస్ట్‌లుగా మెప్పించలేకపోయారు. మొత్తానికి అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై బంపర్ హిట్లు కొడుతున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.



from https://ift.tt/3e1A7dt

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages