కొడుకుకి రాజమౌళి పేరు పెట్టుకున్న బాహుబలి విలన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 16 May 2020

కొడుకుకి రాజమౌళి పేరు పెట్టుకున్న బాహుబలి విలన్

బాహుబలి.. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని ఖండంతరాలు దాటించిన చిత్రం బాహుబలి. సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటింది. అందులో నటించిన వారుసైతం వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యారు. ఇందులో నటించిన కొందరు స్టార్స్ కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగాయి. మరిన్ని అవకాశాలు వరించాయి. బాహుబలి దెబ్బకి ప్రభాస్‌, రానా వంటి తారలు నేషనల్ స్టార్స్‌గా మారారు. ఇక ఈ చిత్రంలో కాళకేయగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రభాకర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనేక సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు పోషించిన... బాహుబలి సినిమాలో ప్రభాకర్ పోషించిన కాలకేయ పాత్ర మాత్రం చిరస్థాయిలో నిలిచిపోనుంది. తాజాగా ప్రభాకర్ మరోసారి బాహుబలి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. తను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం రాజమౌళి అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొస్తాడు ప్రభాకర్. ఆయన వలనే ఈ రోజు మేం, మా ఫ్యామిలీ సంతోషంగా ఉందన్నారు. 'మర్యాద రామన్న' సినిమాకు సెలెక్ట్ అయినప్పుడు తనకు డైలాగ్ చెప్పడం కూడా రాదని, రాజమౌళి గారు సొంతంగా డబ్బులు ఇచ్చి నటనలో మెలుకువలు నేర్పించారని ఆయన చేసిన సాయాన్నిగుర్తుచేసుకున్నారు ప్రభాకర్. బాహుబలిలో అంతటి పవర్‌ఫుల్ పాత్ర ఇచ్చి నాకు దేవుడిగా మారాడని రాజమౌలిపై ప్రశంసల వర్షం కురిపించారు. మర్యాద రామన్న, బాహుబలి సినిమాలకి ముందు తాను పూర్తిగా అప్పుల్లో ఉన్నానన్నారు. అయితే ఈ రెండు సినిమాల వలన తన కష్టాలు తీరి.. ఇవాళ మంచి స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. అందుకే ఆయన చేసిన కృతజ్ఞతకు గుర్తుగా తన కొడుకుకి రాజమౌళి పేరు పెట్టుకున్నాను అని ప్రభాకర్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. మొత్తానికి జక్కన్న కాలకేయను బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో చూపించినా.. నిజ జీవితంలో మాత్రం ఎంతగానే సోయం చేసి ప్రభాకర్ దృష్టిలో హీరో అయిపోయారు.


from https://ift.tt/2Z8gyfr

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages