హరీష్ శంకర్ గొప్ప దర్శకుడు.. బ్లేడ్ తిరగేసిన బండ్ల గణేష్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 18 May 2020

హరీష్ శంకర్ గొప్ప దర్శకుడు.. బ్లేడ్ తిరగేసిన బండ్ల గణేష్

‘లాక్ డౌన్‌లో ఎవరైనా ఎలా ఉన్నావ్ అని అడిగితే.. బాగున్నా అని చెప్పినోడి మానసిక పరిస్థితి సరిగా లేనట్టు.. ఎందుకంటే ఎవరూ బాగోలేదు’.. హ హ!! ఎంతైనా మాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఈయన పొగడ్తల పిపాసి అనే కంప్లైంట్ పక్కనపెడితే వాటిలోనూ వాస్తవాలు ఉంటాయి. సరే ఈ సంగతి పక్కన పెడితే దర్శకుడు హరీష్ శంకర్‌తో వివాదంతో మళ్లీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు బండ్ల గణేష్. గబ్బర్ సింగ్ ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు హరీష్-బండ్ల మధ్య మాటల తూటాలు పేలాయి. రీమేక్ దర్శకుడు తప్పితే మనోడిలో విషయం లేదని.. ఏదో పవన్ కళ్యాణ్ సలహాలు సూచనలతో సినిమా హిట్ అయ్యిందని.. హరీష్ స్ట్రయిట్ మూవీ తీసి హిట్ కొడితే ఇండస్ట్రీ వదిలివెలిపోతా అంటూ బండ్ల గణేష్ శపథం చేశారు. ఇక హరీష్ శంకర్... క్రెడిబులిటీ లేని వ్యక్తుల గురించి మాట్లాడటం వేస్ట్.. అతను నాకు లైఫ్ ఇవ్వడం ఏంటి.. నేనే అతనికి లైఫ్ ఇచ్చా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ ఇద్దరి మధ్య మాటల తూటాలు, పంచ్‌ల వివరాలు కింది లింక్స్‌లో ఇస్తున్నాం కాని.. తాజాగా బండ్ల గణేష్ ఈ ఇష్యూపై బ్లేడ్ తిరగేశారు. హరీష్ శంకర్‌ని గొప్ప దర్శకుడు అంటూ ఓ పొగడ్త వేసుకున్నారు. గబ్బర్ సింగ్ వివాదంపై ఆయన మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాబట్టి 8 ఏళ్లు కాదు.. 80 ఏళ్లు అయినా అలా వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా ఓ చరిత్ర. పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఇష్టమా? అనే మాటలు పదే పదే చెప్పి విసుగు వచ్చేసింది. మాట వరసకు చెప్పుకోవడం కాదు.. ఆయనపై అభిమానం గుండెల్లో ఉంటుంది. ఇక హరీష్‌తో వివాదం అంటే.. చిన్న మాటామాటా వచ్చింది. ఈరోజుల్లో తండ్రికొడుకులు, భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటారు. హరీష్ శంకర్ గొప్ప దర్శకుడు.. నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు. ఇక నాలైఫ్‌లో అతనితో సినిమా చేయను. ఆయనతో ఒకసినిమా చేశా.. ఇక అదే లాస్ట్. మా దేవుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా.. కాని టిక్కెట్ దొరకడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. Read Also: Read Also:


from https://ift.tt/2z72QPo

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages