దాసరి జయంతి: దాసరి పేరుకు అర్థం చెప్పిన చిరంజీవి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 4 May 2020

దాసరి జయంతి: దాసరి పేరుకు అర్థం చెప్పిన చిరంజీవి

దివంగ‌త ద‌ర్శ‌కుడు, న‌టుడు..నిర్మాత దాస‌రినారాయ‌ణ రావుగారి 77వ జ‌యంతి ఇవాళ. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. దాసరి అని పేరుకు అర్థం చెప్పారు మెగాస్టార్.‘దా..దానంలో కర్ణుడుమీరు, స..సమర్ధతలో అర్జునుడు మీరు, రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు, మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది’ అంటూ చిరు ట్వీట్ చేశారు. దాసరితో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు చిరంజీవి. మరోవైపు సందర్భంగా ఫిలిం ఛాంబర్‌లో ఉన్న దాసరి విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సి.క‌ల్యాణ్‌, దాసరి అరుణ్ కుమార్, కోడి పద్మ, కొమర వెంకటేష్. రాజేంద్ర కుమార్ బంగారు బాబు, పి.డి.ప్రసాద్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామసత్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ మా గురువుగారు దాసరిగారి జయంతి మే 4ను డైరెక్ట‌ర్స్ డేగా గతంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌క‌టించిందని గుర్తు చేశారు. ఈరోజును ఈ క‌రోనా వ‌ల్ల డైరెక్ట‌ర్స్ అంద‌రూ లేకుండా సింపుల్‌గా చేయాల్సి వ‌చ్చిందన్నారు. సినీ ఇండ‌స్ట్రీలో దాసరిగారి పేరు గుర్తుండేలా వచ్చే ఏడాది ఆయ‌న జ‌యంతికి ప‌లు మంచి ప‌నులు చేస్తామన్నారు. 1947 మే 4న దాసరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆయనది అతిసామాన్యమైన కుటుంబం. ఆ తర్వాత సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత ,రాజకీయ నాయకుడిగా దాసరి నారయణ రావు పనిచేశారు. దర్శకుడిగా అత్యధిక చిత్రాలు నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కారు. దాదాపు 150 చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారు. 53 సినిమాలకు ఆయన నిర్మాతగా పనిచేశారు.


from https://ift.tt/3fgTpNA

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages