ఎట్టకేలకు ఇంటివాడైన నిఖిల్.. ప్రేయసితో నిరాడంబరంగా పెళ్లి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 13 May 2020

ఎట్టకేలకు ఇంటివాడైన నిఖిల్.. ప్రేయసితో నిరాడంబరంగా పెళ్లి

టాలీవుడ్ యంగ్ హీరో మొత్తానికి ఓ ఇంటివాడైపోయాడు. ప్రేయసి పల్లవిని వివాహమాడి భర్తగా ప్రమోషన్ కొట్టేశాడు. ఈ రోజు (మే 14) ఉదయం 6 గంటల 31 నిమిషాలకు పెద్దలు నిశ్చయించిన ముహార్తానికి నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతం శామిర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో అత్యంత సన్నిహితుల హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. నిజానికి తన పెళ్లిని చాలా గ్రాండ్‌గా చేసుకోవాలని నిఖిల్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఉహించని విధంగా కరోనా వైరస్ విజృభించడం, ప్రభుత్వం లాక్‌డౌన్ కారణంగా నిరాడంబరంగా కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నవ వధూవరులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు పలువురు సెలబ్రిటీలు. భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి కోసమై ఏప్రిల్ 16వ తేదీ ఫిక్సయ్యారు. అయితే, పెళ్లి తేదీకి సుమారు నెల రోజుల ముందు లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో రెండు కుటుంబాలు చర్చించుకుని మే 14వ తేదీని ఖరారు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ ముగిసే వరకు పెళ్లిని వాయిదా వేయాలని నిఖిల్ నిర్ణయించుకున్నారు కానీ.. మంచి ముహూర్తాలు దరిదాపుల్లో లేకపోవడంతో ఈ రోజు (మే 14వ తేదీ) పెళ్లి చేసుకున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఘనంగా విందు ఏర్పాటు చేయాలని నిఖిల్ జోడీ భావిస్తున్నారు.


from https://ift.tt/2WvvRNw

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages