కరోనా వైరస్ గత మూడు నెలలుగా భారత్‌పై విజృంభిస్తున్న ఈ వైరస్ అనేకమంది జీవితాల్ని బలి తీసుకుంది. వేలాదిమందిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది. వలస కూలీల వెతల్ని మనం రోజూ వింటూనే ఉన్నాం. ఉపాధి లేక మరికొందరు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో పనుల్లేక పస్తులుంటున్నారు. ఈ వైరస్ కారణంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి. లాక్‌డౌన్ వలన షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో రోజువారి వేతనం పొందే కార్మికులకి ఉపాధి కరువైంది. చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొందరు నటులు కూడా దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నారు. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డ్రీమ్ గార్ల్. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన నటుడు సోలంకి దివాకర్. ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారు. ఇప్పుడు లాక్ డౌన్ వలన షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో తిరిగి పాత వృత్తినే కొనసాగిస్తున్నాడు. గత రెండు నెలలుగా ఆయన పండ్లు అమ్ముకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నట్టు తెలుస్తుంది. హల్క, హవా, టిట్లీ, కడ్వి హవా, సోంచారియా తదితర చిత్రాలలో సోలంకి నటించారు. కొన్నిరోజుల క్రితం ముంబయిలో మన్మీత్ గ్రేవాల్ అనే టీవీ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 'ఆదాత్ సే మజ్బూర్', 'కుల్దీపక్' అనే టీవీ కార్యక్రమాల ద్వారా సుపరిచితుడైన మన్మీద్ విషాదకర పరిస్థితుల్లో తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షూటింగుల్లేక, చేతిలో డబ్బు లేక మానసిక ఆందోళనకు గురైన మన్మీత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
from https://ift.tt/3e7MODF
No comments:
Post a Comment