ప్రముఖ గేయ రచయిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ఆయన్ని పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో రక్తం కొరత విపరీతంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ బ్లడ్ గ్రూప్ B నెగిటివ్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఈ బ్లడ్ గ్రూప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా B నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న రక్త దాతలు ఉంటే గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో సంప్రదించవచ్చని.. 8985038016 నంబర్‌ని సంప్రదించి రక్త దాతలు ముందుకు రావాలని సుద్దాల అశోక్ తేజ మిత్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. కాగా సుద్దాల అశోక్ తేజ.. అనేక విప్లవ గీతాలతో క్లాసిక్ సాంగ్స్‌ను రాశారు. నేను సైతం (ఠాగూర్), ఒకటే జననం.. ఒకటే మరణం (భద్రాచలం), ఇనుములో ఒక హృదయం మొలిచెనే (రోబో), నువ్ ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణా, వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే (ఫిదా) వంటి సూపర్ హిట్స్ సాంగ్స్ రాశారాయన. ప్రస్తుతం సుద్దాల ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో మూడు పాటలు రాయడం విశేషం.
from https://ift.tt/2TrS3pT
No comments:
Post a Comment