నాగార్జున అప్పుడప్పుడు ఎమోషనల్ ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా తన జీవితంలో రెండు రోజులు మరిచిపోలేనవని నాగార్జున సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే 22, మే 23 తేదీలు తన జీవితంలో ఎన్నడూ మరిచిపోనని ట్వీట్ చేశారు. మరి ఆ రెండు రోజులకు అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు మే 22 సినిమా విడుదలయితే.. మే 23న అక్కినేని కుటుంబంలోని హీరోలంతా వెండితెరపై అలరించిన రిలీజ్ అయ్యింది. అందుకే ఆ రెండు రోజుల్ని తన జీవితంలో మరిచిపోలేనంతూ నాగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ముందుగా అన్నమయ్య సినిమా విషయానికి వస్తే... ఆయన 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు. అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య చిత్రం 1997 మే 22న విడుదలైంది. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించారు. సినీ కవి ఆత్రేయ సైతం అన్నమయ్య కోసం 18 పాటలను కూడా రికార్డు చేయించి స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నారు. కానీ ఈలోపే ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. ఆఖరికి జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా 1997లో ఆ కల సాకారం అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే. ఈ సినిమాను తమిళంలోకి డబ్బింగు చేసి అన్నమాచారియర్ గానూ, హిందీలోకి డబ్బింగు చేసి తిరుపతి శ్రీ బాలాజీగానూ విడుదల చేశారు. అన్నమయ్యకు తదుపరి చిత్రంగా నాగార్జున, రాఘవేంద్రరావు కలిసి అన్నమయ్య కుటుంబం ఆధారంగా ఇంటింటా అన్నమయ్య అన్న సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. అయితే అప్పటికే యాక్షన్, రొమాంటిక్ సినిమాల్లో నటిస్తున్న నాగార్జున.. ఈ సినిమాకు సరిపోతాడా అని చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు.కానీ వారందరి నోరు మూతపడేలా తన అద్భుతమైన నటనతో నాగ్ విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకున్నారు. ఇక మనం సినిమా గురించి అందరికీ తెలిసిందే. తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు. గతంలో నితిన్, నిత్యా మీనన్ కలిసి నటించిన ఇష్క్ సినిమా ద్వారా గుర్తింపు సాధించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, దర్శకత్వాన్ని అందించారు. ఈ సినిమా 2014 మే 23న విడుదల చేశారు.
from https://ift.tt/2LUoMjo
No comments:
Post a Comment