సందీప్ కిషన్ సోలో హీరోగా నటించిన రెండో చిత్రం ‘డీకే బోస్’. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరోయిన్. ఏఎన్ బోస్ దర్శకత్వం వహించారు. ఆనంద్ రంగ, శేషు రెడ్డి నిర్మాతలు. 2012లో ఈ సినిమాను రూపొందించారు. అవినీతికి పాల్పడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందీప్ కిషన్ నటించారు. 2013 సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. ట్రైలర్, అలాగే ‘పడిపోయా’ అనే పాటను కూడా విడుదల చేశారు. అప్పట్లో ఈ పాట ఎఫ్ఎం రేడియోల్లో మారుమోగింది. అయితే, కారణాలేంటో తెలీదు కానీ సినిమా మాత్రం విడుదల కాలేదు. అప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ సినిమా ప్రస్తావనను హీరో సందీప్ కిషన్ తాజాగా తీసుకొచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం అభిమానులకు చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు. అప్పట్లో విడుదలైన ‘పడిపోయా’ సాంగ్ ఫుల్ వీడియోను ఈరోజు విడుదల చేశారు. అచ్చు రాజమణి ఈ పాటను స్వరపరిచారు. ఆయనే స్వయంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. అయితే, ఆగిపోయిన సినిమాలోని పాటను ఇప్పుడెందుకు విడుదల చేశారు అనే అనుమానం రావచ్చు. ఎందుకంటే.. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. Also Read: ‘డీకే బోస్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు నిర్మాత ఆనంద్ రంగ స్పష్టం చేశారు. 2013 నాటి రిలీజ్ ప్లాన్స్ గురించి ఆయన మాట్లాడుతూ..‘‘డిస్ట్రిబ్యూషన్ ప్రణాళికలను ఖరారు చేశాం. సెప్టెంబర్‌లో అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ విడుదల కావడానికి 10 రోజులు ముందు మా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించాం. కానీ, విడుదలకు ముందే ‘అత్తారింటికి దారేది’ పైరసీ వచ్చేసింది. సగం సినిమాను ఇంటర్నెట్‌లో పెట్టేశారు. దీంతో ఆ సినిమా విడుదల తేదీని ముందుకు జరిపారు. ఆ సినిమాతో పోటీ పడటం అసాధ్యం. అందుకే మా సినిమా ఆపాల్సి వచ్చింది. ఆ తరవాత రకరకాల అంతర్గత కారణాలతో సినిమా విడుదల ఆగిపోయింది’’ అని చెప్పుకొచ్చారు. ఏడేళ్ల తరవాత కూడా ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆనంద్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో కంటెంట్ ఔట్ డేటెడ్‌గా ఉండదని చెప్పారు. ఇది మంచి కాన్సెప్ట్‌తో కూడుకున్న చిత్రమని, రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమా కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు.
from https://ift.tt/2zmg1eQ
No comments:
Post a Comment