టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరికిషన్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయస్సు 57 ఏళ్లు కాగా.. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సికింద్రాబాద్‌లోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆయన చనిపోయినట్టు ఆయన సన్నిహితులు తెలియజేశారు. ఆయన పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండటంతో వాళ్లు వచ్చేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో బాడీని మార్చురీకి తరలించారు. ఏలూరులో జన్మించిన హరికిషన్.. ఎనిమిదేళ్ల వయసు నుంచే మిమిక్రీ చేయడం నేర్చుకున్నారు. పాతకాలం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు మొదలుకొని.. ఆ తరువాత తరంలోని చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జున.. నేటి తరంలోని మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వాయిస్‌ను మిమిక్రీ చేయడంలో నేర్పరి హరికిషన్. కేవలం వాయిస్‌లను మాత్రమే కాకుండా పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు తన గొంతుతో పలికించేవారు హరి కిషన్. పాటలు పాడుతూ.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో పలకించడం హరి కిషన్ ప్రత్యేకత. అనేక సినిమా ఈవెంట్లతో పాటు ఎన్నికల ప్రచారాల్లోనూ రాజకీయ నాయకుల వాయిస్‌తో మాట్లాడి పాపులర్ అయ్యారు హరికిషన్. ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్న హరికిషన్ మరణం పట్ల టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది.
from https://ift.tt/3gan0sx
No comments:
Post a Comment