లారెన్స్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం.. స్వస్థలాలకు ఏపీ ప్రజలు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 12 May 2020

లారెన్స్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం.. స్వస్థలాలకు ఏపీ ప్రజలు

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు. తన సంపాదనలో చాలా వరకు ఆయన సామాజిక సేవకే వినియోగిస్తున్నారు. ఎంతో మంది అనాధలను, పేదలను ఆయన కష్టకాలంలో ఆదుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ కష్టకాలంలోనూ ఆయన పేదలకు అండగా నిలబడ్డారు. ఇండస్ట్రీలో ఉపాధి కోల్పోయిన ఎంతో మందిని ఆదుకున్నారు. కరోనా రిలీఫ్ కింద ఆయన రూ.3 కోట్లు ప్రకటించారు. ఇప్పటికే చాలా మందికి సాయం అందింది. Also Read: అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది వలస కూలీలు ఉపాధి కోసం చెన్నై వెళ్తుంటారు. అలా వెళ్లిన కొంత మంది కూలీలు అక్కడ చిక్కుకుపోయారు. వాళ్లకు తిండి లేదు, ఉండటానికి ఆశ్రయం లేదు. చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం లారెన్స్‌కు తెలిసింది. వెంటనే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి దృష్టికి తీసుకెళ్లారు. లారెన్స్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం.. ఏపీ వలస కూలీలను స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేశారు. సీఎం తక్షణ స్పందన పట్ల లారెన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ ద్వారా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. Also Read: ‘‘గౌరవ ముఖ్యమంత్రి ఎడప్పడి కె. పళనిసామి గారికి నా ధన్యవాదాలు. ఈ కరోనా కష్టకాలంలో చాలా రోజులుగా కూడు, గూడు లేకుండా ఇక్కడే ఇరుక్కుపోయిన 37 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కొన్ని రోజుల క్రితం నేను రిక్వెస్ట్ చేశాను. నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు. ఆయన సెక్రటరీ విజయ్ కుమార్ గారిని పుర్మాయించారు. వారం రోజుల సమయంలోనే రవాణా సౌకర్యాన్ని కల్పించారు. 37 మందిని ట్రైన్‌లో స్వస్థలాలకు పంపారు. ఈ విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిసామి గారికి, ఆయన సెక్రటరీ విజయ్ కుమార్ గారికి, కలెక్టర్ జాన్ లూయిస్ గారికి, ఇతర అధికారులు, నా అభ్యర్థనకు వెంటనే స్పందించిన ప్రొఫెసర్ రాధా కన్నన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి ఎడప్పడి కె పళనిసామి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆ రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను. సేవే దైవం’’ అని తన పోస్ట్‌లో రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అలాగే, చెన్నై నుంచి ఏపీకి బయలుదేరిని వలస కూలీల వీడియోను కూడా లారెన్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.


from https://ift.tt/2LhFgSB

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages