కరోనా మహమ్మారి మానవాళి జీవనశైలినే మార్చేసింది. పేదల జీవితాలను అతలాకుతలం చేసింది. రోజువారీ వేతనాలకు పనిచేసే ఎంతో మంది కార్మికుల పొట్టకొట్టింది. ఎన్నో రంగాల్లో రోజువారీ వేతనానికి పనిచేసే ఎంతో మంది కార్మికులు లాక్‌డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేసుకోలేని పరిస్థితి. అందుకే, అలాంటి వారిని ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మనసున్న ప్రతి ఒక్కరూ ఆదుకుంటున్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికుల్లో సినిమా రంగానికి చెందినవారు కూడా ఉన్నారు. వీళ్లను ఆదుకోవడానికి కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేశారు. సినిమా రంగంలో ఉన్న ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న కార్మికులందరికీ ఈ చారిటీ ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే, సూపర్ మార్కెట్లలో సరుకులు కొనుక్కోవడానికి కూపన్లు అందజేశారు. అయితే, ఆయా సంఘాల్లో లేకుండా సినిమా రంగంలో పనిచేసే మహిళలు, లైట్‌మన్‌లు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయం తెలుసుకున్న నటుడు జగపతిబాబు వారిని ఆదుకునే ప్రయత్నం చేయారు. Also Read: సినిమా నిర్మాణ పనులు లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు, లైట్‌మన్‌లకు సోమవారం నటుడు జగపతిబాబు నిత్యావసర సరుకులు, మాస్క్‌లు పంపిణీ చేశారు. 400 మంది సినిమా కార్మికులకు బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను జగపతిబాబు అందించారు. ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్, భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు, జగపతి బాబు మేనేజర్ మహేష్, సహాయకుడు రవి పాల్గొన్నారు.
from https://ift.tt/2Txmtag
No comments:
Post a Comment