తెలుగు సినిమాకి కులం-ప్రాంతం ఉన్నాయి అంటున్నారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. కమ్మ కుల ఆధిపత్యం అధికంగా ఉండే తెలుగు సినిమాకి, పచ్చి రంగు పులిమింది మన విజనరీ చంద్రబాబు నాయుడే.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . ఎందుకలా అంటే!! సుదీర్ఘమైన వివరణ ఇస్తూ.. ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు కత్తి మహేష్. కులాలవారీ జరిగే రాజకీయమే సినిమా పరిశ్రమలోనూ ఒక విధానం అయ్యింది.కమ్మ కుల ఆధిపత్యం అధికంగా ఉండే తెలుగు సినిమాకి, పచ్చి రంగు పులిమింది మన విజనరీ చంద్రబాబు నాయుడే. నటుల్ని సాంకేతిక నిపుణుల్ని ప్రచారం కోసం వాడుకోవడమేకాక ప్రభుత్వంలో కూడా కీలక పదవుల్లో నియమించడంతో "మావాళ్ళు-మీవాళ్ళు" అనే సినిమా మొదలైంది. అప్పటికే హీరోలవారీగా కొట్టుకునే ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్నా, కులాల ప్రకారం ఫ్యాన్స్ క్లబ్స్ ఏర్పడటం మరొక డామినేటెడ్ కులం కాపు లతో మొదలయ్యింది. సంఖ్యాపరంగా ఎక్కువ ఉండే కాపులకు చిరంజీవి పుణ్యమా అని 9 మంది హీరోలు తయారయ్యారు. వీళ్ళతో ఏ సినిమా తీసినా కులాభిమానం కారణంగా మినిమం గ్యారంటీ ఉంటుంది. అది చూసుకునే ఈ కులం హీరోలు చిరంజీవి,పవన్ కళ్యాణ్,నాగబాబులు రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుని చతికిలబడ్డారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సమాజంలో ప్రాంత - కుల బేధాలతో ఉంది. తెలంగాణా వచ్చాక ఎన్ని తెలంగాణా యాసలో సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయో. విజయ్ దేవరకొండ ఒక ఫినామినా ఎలా అయ్యాడో మనకి అర్ధం కాదా! రాయలసీమ నుంచీ ఆరాకోరాతప్ప నటులు,దర్శకులకి మాత్రమే అవకాశాలు ఉండటంలో వివక్ష లేదా? ఉత్తరాంద్ర ఊసెత్తిన సినిమాల సంఖ్య ఎంత?హీరో నితిన్ ని ఓన్ చేసుకోవడానికి తెలంగాణా రెడ్లు పడుతున్న శ్రమ మీకు తెలియదా!? ఇక కులాల సంగతి విశ్వవిదితమే. మొన్న శంకరాభరణం సినిమాకి ఏళ్ళోచ్చాయని, దర్శకులు కె.విశ్వనాథ్ గారికి చేసిన సన్మాన సభలో 90% బ్రాహ్మణ దర్శకులు సాంకేతిక నిపుణులు ఎవరికీ కనపడలేదా!?! తప్పులేదు. కాబట్టి ఈ నిజాన్ని గ్రహించి మనమన కులాల్లో యూనివర్సల్ అప్పీల్ ఉండే హీరోలను. మన కథల్ని చెప్పే దర్శకులను తయారు చేసుకోవడంలో ఆలస్యం చేయ్యకూడదు. కులంపోదు. ప్రాంతం ఉంటుంది. వాటి రెప్రజెంటేషన్ లేకపోతే సినిమా సామాజికం కాదు. కాబట్టి, కుల-ప్రాంత రహిత సినిమాకు అర్ధం లేదు. అందుకని కొంత నిజాయితీగా ప్రయత్నిస్టే వైవిధ్య భరితమైన సినిమాలు వస్తాయి. అవి వివిధ రంగుల్లో ఉంటాయి. మంచిదే!’’ అంటూ సినిమా ఇండస్ట్రీలోని కులరక్కసిపై కత్తి దూశాడు కత్తి మహేష్.
from https://ift.tt/2yjaLIV
No comments:
Post a Comment