విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. హృదయ విదారకం అంటూ వరుస ట్వీట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 7 May 2020

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. హృదయ విదారకం అంటూ వరుస ట్వీట్స్

విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ఈ రోజు (మే 7) తెల్లవారుజామున ఒక్కసారిగా విష వాయువు లీక్ కావడంతో ఆ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి వాతావరణంలో విషపూరిత గ్యాస్ కలవడంతో జనం ఊపిరాడక చనిపోతున్నారు. ఇప్పటికే ఐదుగురు మరణించగా.. దాదాపు 2వేలకు మందికిపైగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అక్కడి దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. తాజాగా ఈ విషాద ఘటనపై జనసేన అధినేత స్పందించారు. ''విశాఖ దుర్ఘటన హృదయవిదారకం. కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి. విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై ఐదు కిలోమీటర్ల మేర ప్రజల భయకంపితులు అవుతున్నారు'' అన్నారు పవన్. అలాగే.. పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ''రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలి. కఠినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నాయకులకు సూచించాను'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ''8 మంది మృతి చెందటం, వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి'' అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.


from https://ift.tt/2YFdK9h

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages