నేను నీలానే బాధపడ్డా... విజయ్‌కు అండగా చిరంజీవి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 5 May 2020

నేను నీలానే బాధపడ్డా... విజయ్‌కు అండగా చిరంజీవి

విజయ్ దేవరకొండకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తుంది. తనపై వచ్చిన తప్పుడు కథనాలపై ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలంతా ఆయనకు అండగా నిలస్తున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ సైతం విజయ్‌కు నేనున్నానన్న భరోసా ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా ఆయన తన మద్దతు తెలిపారు. ‘ విజయ్ మీ ఆవేదనను అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. మీ వెంట మేమంతా ఉన్నామన్నారు. మంచి పనిచేసే విషయంలో ఎప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దన్నారు . అదే సమయంలో జర్నలిస్టులకు కూడా చిరు ఓ రిక్వెస్ట్ చేశారు. దయచేసి మీ సొంత అభిప్రాయాల్ని రుద్దకుండా వార్తను వార్తలాగా రాయాలన్నారు మెగాస్టార్. ఇప్పటికే విజయ్‌కు సపోర్ట్‌గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. అల్లరి నరేష్ సైతం అండగా ఉంటానన్నారు. ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్స్‌పై పోరాటం చేస్తున్న విజయ్‌కు మద్దతుగా రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్ వంటి వారు మద్దతుగా నిలిచారు. నాటి హీరోయిన్ రాధికా కూడా విజయ్‌కు మరింత బలం చేకూరాలంటూ ట్వీట్ చేసింది. చిరంజీవికి ముందు మెగా బ్రదర్ నాగబాబు సైతం దేవరకొండకు సపోర్ట్ చేశారు. ట్వీట్ చేస్తూ.. 'హాయ్ విజయ్.. నేను నీకు బలంగా మద్దతిస్తున్నాను.. సినిమా పరిశ్రమ రక్తాన్ని పీల్చే కొన్ని వెబ్‌సైట్లపై పోరాటం చేయడం అనేది, వాటిపై స్పందించడమనేది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.. నువ్వు స్పందించినందుకు థ్యాంక్స్.. టైమ్ టు టేక్ యాక్షన్ మై బాయ్' అని పేర్కొన్నాడు.


from https://ift.tt/2SBiOrn

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages