ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్లపై చర్యలకు సిద్ధం.. లాక్‌డౌన్ పూర్తికాగానే..! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 5 May 2020

ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్లపై చర్యలకు సిద్ధం.. లాక్‌డౌన్ పూర్తికాగానే..!

తనపై తప్పుడు వార్తలు రాసిన వెబ్‌సైట్లపై హీరో విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినిమా హీరోలపై ఇలాంటి తప్పుడు వార్తలు రాసే, అసత్య ప్రచారాలు చేసే వెబ్‌సైట్లను బహిస్కరించాలని, వాటిపై చర్యలు తీసుకోవాలని విజయ్ పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్లను చూడొద్దని సూచించారు. అయితే, ఈ విషయంలో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మద్దతు లభిస్తోంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్పందించడంతో విషయం చాలా దూరం వెళ్తుందని స్పష్టమవుతోంది. విజయ్‌కు మద్దతుగా మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ‘నీకు అండగా నేనున్నాను బ్రదర్’ అంటూ భరోసా ఇచ్చారు. ఆ తరవాత రవితేజ, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, కొరటాల శివ, హరీష్ శంకర్ తదితరులు విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపారు. ఇక సహించేది లేదని.. ఆ వెబ్‌సైట్లపై చర్యలకు ఉపక్రమించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, ఈ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధమని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. Also Read: అబద్ధపు వార్తలు రాసే వెబ్‌సైట్స్‌ను నిర్మాతల మండలి వ్యతిరేకిస్తోంది. హీరోలు, దర్శకులు విజయ్ దేవరకొండకు సపోర్ట్ చెయ్యడాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సమర్థిస్తుంది. ‘‘ఒక మనిషి తన స్తోమతకు తగ్గట్లు సహాయం చేస్తాడు. దానిపై కూడా కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు. సినిమా యాడ్స్ వలన రెవెన్యూ పొందుతూ ఇలా సినిమా వారిపైన నెగిటివ్ ఆర్టికల్స్ రాయడం కరెక్ట్ కాదు. ఈ విషయంపై లాక్‌డౌన్ పూర్తయిన తరువాత అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఫేక్‌న్యూస్ రాసే వెబ్‌సైట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే మేం చర్యలు తీసుకుంటాం’’ అని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తమ ప్రకటనలో పేర్కొంది.


from https://ift.tt/3feIWCa

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages