సమంతకు ఎక్కువ డబ్బులిచ్చాం అని ఎక్కువ వాడలేం.. కిచిడీ అయిపోద్ది: కొరటాల - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 21 May 2020

సమంతకు ఎక్కువ డబ్బులిచ్చాం అని ఎక్కువ వాడలేం.. కిచిడీ అయిపోద్ది: కొరటాల

కొరటాల శివ.. టాలీవుడ్‌లో ఓటమి ఎరుగని స్టార్ దర్శకుడు ఈయన. చేసినవి నాలుగే చిత్రాలు అయినా ఈ నాలుగు ఇండస్ట్రీ హిట్సే. ప్రభాస్‌తో మర్చి, మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ చిత్రాలను రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే హీరోయిజాన్ని చూపించడంతో కొరటాల శివది ప్రత్యేకమైన శైలి. అదే సందర్భంలో ఈయన సినిమాల్లో హీరోయిన్స్ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదనే కంప్లైంట్ ఉంది. దానిపై కొరటాల స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నిజానికి కొరటాల సినిమాల్లో హీరోయిన్ పాత్రకు సంబంధించి నిడివి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అయితే అది పెద్ద విషయం కాదు.. ఎంతసేపు ఉన్నది అన్నది కాదు.. ఉన్నంతలో ఎంత బాగా చూపించాం అన్నదే తనకు ముఖ్యం అంటున్నారు కొరటాల. ఆయన మాట్లాడుతూ.. ‘నా సినిమాల్లో కథకు తగ్గట్టుగా హీరోయిన్ పాత్ర ఉంటుంది. ప్రత్యేకించి హీరోయిన్స్ కోసం నిడివి పెంచితే సినిమా కిచిడీ అవుతుంది. కథతో సంబంధం లేకుండా హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్లడం లాంటి సీన్ల గురించి నేను పట్టించుకోను. నా సినిమాలో హీరోయిన్ ఉన్న కాసేపు ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే ఆలోచిస్తా. జనతా గ్యారేజ్ సినిమానే తీసుకుందాం.. అది కథ కాదు.. నిత్యా మీనన్ కథ కాదు.. అది ‘జనతా గ్యారేజ్’కి సంబంధించిన కథ. ఈ కథలో హీరోయిన్‌ని ఎంత వరకూ ఉపయోగించుకోవాలే అంతే ఉపయోగించుకోవాలి.. అంతే తప్ప సమంత దొరికింది.. లక్షలు ఇచ్చాం అని వాడేద్దాం అనుకుంటే సినిమాకి ఇబ్బంది అవుతుంది. నా సినిమాలో పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా అద్భుతంగా ఉండాలి. జనతాగ్యారేజ్‌లో సమంత క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్.. తన బావే తనకు ప్రాణం అనుకుంటుంది. అతను ఏం చేసినా పిచ్చిగానే నమ్ముతుంది.. నువ్ ఏం చేసినా పిచ్చే.. నిన్ను వదిలేయడం కూడా పిచ్చే అంటుంది. ఇంతకంటే పవర్ ఫుల్ పాత్ర ఏంటి? ఒక అమ్మాయికి. సినిమా అంతా ఉండి.. గోల చేయడం కంటే.. ఉన్న పది నిమిషాలు ఏడిపించి వెళిపోతే బెటర్ అని నా అభిప్రాయం ఆమె క్యారెక్టర్‌ని జనం బాగా ఇష్టపడ్డారు. సమంత ఎంత సేపు ఉండటం ఏంటి? అదేం లెక్క..? ఆడియన్‌లా సినిమా చూస్తే ఇవి కనిపించవు’ అంటూ చెప్పుకొచ్చారు కొరటాల.


from https://ift.tt/2TnXl5I

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages