విజయ్ దేవరకొండకి ‘మా’ మద్దతు.. ఇలాంటి వార్తలు రాస్తే ఊరుకోం!! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 6 May 2020

విజయ్ దేవరకొండకి ‘మా’ మద్దతు.. ఇలాంటి వార్తలు రాస్తే ఊరుకోం!!

ఫేక్ న్యూస్, అర్థం పర్థంలేని గాసిప్‌‌లు రాస్తోన్న వెబ్‌సైట్లపై హీరో విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వెబ్‌సైట్లపై ఆయన యుద్ధం ప్రకటించారు. ఈ విషయంలో టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనకి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు దగ్గర నుంచి చాలా మంది హీరోలు, దర్శకులు విజయ్‌కి తమ మద్దతు ప్రకటించారు. దీనిపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కూడా స్పందించింది. అలాంటి వెబ్‌సైట్లపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కూడా విజయ్‌కు తమ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ వెల్లడించారు. మంచి కార్యక్రమం చేస్తున్న విజయ్‌పై పలువురు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని బెనర్జీ అన్నారు. ‘‘ఈ లాక్‌డౌన్ సమయంలో విజయ్ దేవరకొండ ఒక ఛారిటీని పెట్టి నిధులు పోగు చేసి తనవంతు సాయంగా పేదలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారు. దాంతో పాటు మనకోసం - సీసీసీకి కూడా విరాళాన్ని ఇచ్చారు. చాలామంది సాయం అవసరమైనా వారంతా చేతులు చాచి ఎటువంటి సాయం అడగలేరు. వారికి అభిమానం అడ్డు వస్తుంది. అటువంటి వారందరూ విజయ్ దేవరకొండ ప్రారంభించిన ఈ ఛారిటీ ద్వారా ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ చేసి ఆ సాయాన్ని పొందవచ్చు అనే సదుద్దేశంతో ఆయన దీనిని ప్రారంభించారు. Also Read: ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఆయనపై పలువురు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారిని నేను నిలదీస్తున్నా.. అసలు మీరు ఎవరు, మా ఆర్టిస్టులు మా ఇష్టం. ఎవరికి సాయం చేస్తాం.. ఎవరికి ఎంత డొనేట్ చేస్తాం అనేది మా ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలపై ఎవరికి సమాధానం చెప్పాలి.. ఎవరికి చెప్పకూడదనేది మా ఇష్టం’’ అని బెనర్జీ తెలిపారు. కొన్ని వెబ్‌సైట్స్‌ చేస్తున్న నిరాధార ఆరోపణలతో చాలా ఇబ్బందులకి గురి అవుతున్నామని బెనర్జీ అన్నారు. నటులను ప్రతి విషయంలో బయటికి రండి అని ప్రశ్నించడమేంటని, ఇదేం దొంగతనం కాదని బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ తప్పుడు వార్తలు రాసే వారికి ధైర్యం ఉంటే ముందు మీరు బయటికి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ముందు మీ ప్రొఫెల్‌ని బయటపెట్టండి. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే ఊరుకోం. విజయ్ దేవరకొండకి నేను మద్దతు ఇస్తున్నాను. సినీ వెబ్ సైట్స్, ఫిల్మ్ జర్నలిస్టులకి, సినీ పరిశ్రమకి ఇంటర్నెల్ లింక్ ఉంది. అందరూ అన్నదమ్ములం. మేమంతా ఒక ఫ్యామిలీ. సినీ పరిశ్రమకి మీడియా వారి సపోర్ట్ తప్పక కావాలి. దాన్ని మంచిగా ఉపయోగించాలి. విజయ్‌కి జరిగినట్టు మరెవ్వరికి జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందరం కలిసి మెలసి ఉందాం’’ అని బెనర్జీ వెల్లడించారు.


from https://ift.tt/2A5hUgz

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages