విలాసవంతమైన భవనంలో ఆయనతో స్టార్ హీరోయిన్.. లాక్‌డౌన్ సమయంలో జాలీగా! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 16 May 2020

విలాసవంతమైన భవనంలో ఆయనతో స్టార్ హీరోయిన్.. లాక్‌డౌన్ సమయంలో జాలీగా!

కరోనా కారణంగా ఏర్పడిన ఈ విరామ సమయాన్ని సెలబ్రిటీలు జాలీగా గడుపుతున్నారు. లాక్‌డౌన్ వల్ల షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో తమ తమ కుటుంబాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా.. తన భర్త నిక్ జోనాస్‌తో విలాసవంతమైన భవనంలో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్న తమ భారీ భవనంలో ప్రస్తుతం ఈ జోడీ సరదా సమయం గడిచిపోతోంది. రోజంతా వర్కవుట్స్ చేస్తూ, పెంపుడు కుక్కతో ఉల్లాసంగా ఉంటున్నారు ప్రియాంక- నిక్ దంపతులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. తనకంటే పదేళ్లు చిన్నవాడైన హలీవుడ్‌ గాయకుడు నిక్‌ జోనాస్‌‌ని ప్రేమించి పెళ్లాడింది ప్రియాంకా చోప్రా. ఆ సమయంలో వీరిద్దరి రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. నేటికీ అదే రేంజ్ రొమాంటిక్ లుక్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది ప్రియాంక. పెళ్లయ్యాక హాయిగా హనీమూన్ షికార్లు కొట్టిన ఈ హాట్ జోడీ.. ఆ తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. దీనికోసం దాదాపు 150 కోట్ల రూపాయలు (20 మిలియన్‌ డాలర్స్) వెచ్చించారట. ఈ భవనం తాలూకు విశేషాలు, అందులోని అత్యాధునిక సదుపాయాల గురించి తెలిసి అంతా షాక్ అవుతున్నారు. 20 వేల చదరపు అడుగులతో ఉన్న ఈ ఇంట్లో 7 పడక గదులు, 11 బాత్‌ రూమ్‌లు ఉన్నాయి. హై సీలింగ్‌, హోమ్ థియేటర్స్‌తో పాటు ఇంటిముందు విశాలమైన మైదానం కూడా ఉంది. గ్లోబల్ స్టార్ హోదాలో హాయిగా భర్తతో ఈ భవనంలోనే లాక్‌డౌన్ సమయాన్ని ఉల్లాసంగా గడుపుతోంది .


from https://ift.tt/3cGfzXF

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages