తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్స్ హవా కొనసాగుతోంది. ఒకే తెరపై ఇద్దరు హీరోలను చూసేందుకు జనం ఆసక్తిచూపుతున్నారు. దీంతో దర్శకనిర్మాతలు సైతం మల్టీస్టారర్ సినిమాలు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు .. ఓ అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథను విక్టరీ , నాచురల్ స్టార్ నానిలతో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందాల్సి ఉందనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో సినిమా ఫినిష్ చేశాక ఈ సినిమాను స్టార్ట్ చేయాలనుకున్నారు త్రివిక్రమ్. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ గ్యాప్ రావడంతో ఈ రెండు నెలల సమయంలో ఆ కథపై కసరత్తులు చేశారట త్రివిక్రమ్. స్టోరీ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన.. ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు నానికి అవకాశం ఇవ్వాలని, క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా ఈ మూవీ రూపొందించాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు నానిని సంప్రదించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. Also Read: ఇకపోతే ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అంతా ఫినిష్ చేశారు. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమాను అతిత్వరలో సెట్స్ మీదకు తీసుకురానున్నారు. దీనికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. సో.. చూడాలి మరి ఈ మూవీతో పాటే వెంకటేష్ సినిమా పూర్తిచేస్తారా? లేదంటే ఎన్టీఆర్ మూవీ ఫినిష్ అయ్యాక ఆ పనులు మొదలు పెడతారా? అనేది.
from https://ift.tt/3d1yht2
No comments:
Post a Comment