‘ది డైరెక్టర్’ మూవీ: ఇప్పటి వరకు చూడని బోల్డ్ కంటెంట్.. సెట్‌లో నగ్నంగా డైరెక్టర్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 6 May 2020

‘ది డైరెక్టర్’ మూవీ: ఇప్పటి వరకు చూడని బోల్డ్ కంటెంట్.. సెట్‌లో నగ్నంగా డైరెక్టర్

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. అయినప్పటికీ ఈ లాక్‌డౌన్ సమయంలో షూటింగ్ పూర్తిచేసుకుని ఓ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా బోల్డ్ మూవీ. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘ఆఫీసర్’, ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (GST) కథలు తనవేనంటూ ఆరోపణలు చేసిన రచయిత పి.జయకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇది. టైటిల్ ‘ది డైరెక్టర్’. ఈ సినిమా పోస్టర్లను తాజాగా విడుదల చేశారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. కరోనా సమయంలో చిత్ర నిర్మాణానికి సహకరించిన టీం మెంబర్స్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్ 3’ సినిమాకు పి.జయకుమార్ కథ అందించారు. GST చిత్రం సెక్సువల్ ఫ్రీడమ్ గురించి ఆలోచింపచేస్తే ‘ది డైరెక్టర్’ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ తాలూకు ఆలోచనలను ప్రశ్నిస్తుందని దర్శకుడు చెప్పారు. అందుకే, విడుదల చేసిన ఒక పోస్టర్‌లో మూవీ సెట్‌లో ఉన్న హీరోయిన్‌ని సెక్సువల్‌గా ఎక్సప్లాయిట్ చేసే ఒక డైరెక్టర్‌కి సంబంధించిన సీన్‌ని తలపిస్తూ డైరెక్టర్ క్యారెక్టర్‌ని నగ్నంగా చూపించామని తెలిపారు. ఆడా మగా విచక్షణలేని ఒక దర్శకుడు, మగాళ్ల పరువుతో ఆడుకునే ఒక ఛాన్సుల్లేని హీరోయిన్, సినిమాల భవిషత్తుతో ఆడుకునే ఒక యోగ్యత లేని సినీ విశ్లేషకుని పాత్రలు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పారు. ఈ పాత్రలన్నీ నిజ జీవితంలో కొంతమంది సెలెబ్రిటీలని తలపించేలా ఉండడం గమనార్హం అయినా అవి కల్పితాలు మాత్రమేనన్నారు. ఈ చిత్రంలోని పాత్రల వ్యక్తిత్వాలు, వాటి సంబంధిత కథనాలు, సన్నివేశాలు వివిధ రంగాల్లో ఎప్పటినుండో ఆనవాయితీగా జరుగుతున్న లైంగిక వేధింపుల ఆధారంగా రూపొందించామని చెప్పారు. కాపీయింగ్, క్యాస్టింగ్ కౌచ్, మీ టూ వంటి అనేక విషయాలపై చిత్రంలో చర్చ ఉంటుందని వెల్లడించారు. విడుదల తేదీ ఇంకా ఫైనల్ చేయలేదని, లాక్‌డౌన్ ముగిసాక నిర్ణయం తీసుకుంటామని, ఈ లోపల ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన బోల్డ్ ఫిల్మ్ ‘GST’, ‘మేరా బేటి సన్నీ లియోనీ బన్నా చాతి హై’ కంటే ఇది ఇంకా సెన్సేషన్ సృష్టిస్తుందని, వాటికి మించిన బోల్డ్ అండ్ థ్రిల్ ఉంటుందనే నమ్మకంతో ఉన్నానని తెలిపారు. Also Read: కాగా, జయకుమార్ విడుదల చేసిన ‘ది డైరెక్టర్’ పోస్టర్‌లే వివాదాస్పదంగా ఉన్నాయి. ‘‘మీరు ఐటమ్ గర్ల్స్ గురించి వినుంటారు. మీరు ఐటమ్ సాంగ్స్ గురించి వినుంటారు. కానీ, సినీ చరిత్రలో మొట్టమొదటిసారి ఐటమ్ బోయ్‌ని పరిచయం చేస్తున్నాం’’ అని ఒక పోస్టర్ మీద రాశారు. దీన్ని బట్టే అర్థమవుతోంది సినిమాలో కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక దర్శకుడిని, ఒక హీరోయిన్‌ని, ఒక సినీ విమర్శకుడిని టార్గెట్ చేస్తూ జయకుమార్ ఈ సినిమాను తీస్తున్నారు.


from https://ift.tt/3frcdd9

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages