కిలాడీ రవితేజ! మాస్ మహారాజ్ జబర్దస్తీ.. - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 28 May 2020

కిలాడీ రవితేజ! మాస్ మహారాజ్ జబర్దస్తీ..

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు మాస్ మహారాజ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల నటుడుగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రతి సినిమాతోనూ ఓ స్పెషల్ కిక్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కమిటయ్యారు రవితేజ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చిత్రవర్గాల సమాచారం. రవితేజ మేనరిజానికి సూటయ్యేలా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ కథ సిద్ధం చేస్తున్నారట డైరెక్టర్ రమేష్ వర్మ. ఇందులో మాస్ మహారాజ్.. తన క్యారెక్టర్‌తో జబర్దస్తీ చేయనున్నారట. అలాగే ఈ చిత్రానికి 'కిలాడీ' అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి యాప్ట్ అయ్యేలా సన్నివేశాల రూపకల్పన, టైటిల్ ఉండాలనే కోణంలో అయితేనే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని టాక్. గతంలో రవితేజ- రమేష్ వర్మ కాంబోలో 'వీర' మూవీ ప్రేక్షుకుల ముందుకొచ్చింది. Also Read: మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ 'క్రాక్' షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 8నే విడుదల చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటించగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.


from https://ift.tt/36FlmKT

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages