చిరంజీవి సర్‌ప్రైజ్: తాను.. నేను.. అంటూ ఆమెతో! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 18 May 2020

చిరంజీవి సర్‌ప్రైజ్: తాను.. నేను.. అంటూ ఆమెతో! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మెగాస్టార్ నేటికీ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఒకానొక సమయంలో సినిమాలు వదిలేసి రాజకీయ బాట పట్టిన ఆయన.. ఆ తర్వాత సినిమాల్లోనే అసలైన మజా ఉందని, సినిమానే అన్నం పెట్టే దేవత అని భావించి తిరిగి వెండితెరపై కాలుమోపారు. అప్పటి నుండి యమ యాక్టివ్ అయిన మెగాస్టార్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సోషల్ మీడియాకు పెద్దపీట వేస్తున్నారు. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన డిఫరెంట్ పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి ఓ సర్‌ప్రైజింగ్ ట్వీట్ చేశారు. Also Read: లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉంటున్న మెగాస్టార్.. వినూత్న ఆలోచన చేశారు. గతంలో 1990లో (అమెరికాలో) శ్రీమ‌తి సురేఖతో క‌లిసి వంట రూములో వంట చేస్తున్న ఫోటోను, ఇప్పుడు 2020లో (ఇండియాలో) కిచెన్‌లో బిజీ బిజీగా అదే స్టైల్‌లో శ్రీమతికి సహకారం అందిస్తున్న ఫోటోను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి షేర్ చేశారు. దీనిపై ''తాను..నేను. కాలం మారినా...దేశం మారినా'' అంటూ ట్యాగ్ అంటించారు. దీంతో ఈ పిక్ చూసిన మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ.. ''ఎన్ని మారినా మీ టైమింగ్ మారదు సార్'' అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇకపోతే వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టిన చిరంజీవి.. ప్రస్తుతం కొర‌టాల‌శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. ఈ సినిమా ఫినిష్ కాగానే సుజీత్, బాబీ, మెహ‌ర్ ర‌మేష్ లాంటి దర్శకులతో ముందుకెళ్లనున్నారు మెగాస్టార్.


from https://ift.tt/36kHUkh

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages