ప్రభాస్ సినిమాలో నటిస్తున్నా: భాగ్యశ్రీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 14 May 2020

ప్రభాస్ సినిమాలో నటిస్తున్నా: భాగ్యశ్రీ

ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ పిక్చర్ ‘మైనే ప్యార్ కియా’. అప్పట్లో ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కోట్లలో నోట్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోయిన్‌గా నటించి భాగ్యశ్రీ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె మరోసారి రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అప్పట్లో ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో డబ్ చేశారు. అయితే ఇప్పుడు భాగ్యశ్రీ నేరుగా ఓ తెలుగు సినిమాలో నటించనున్నట్లు స్వయంగా ఆమే తెలిపారు. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కథ విన్నానని ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. . తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన భాగ్యశ్రీ తన కమ్‌బ్యాక్ గురించి స్పందించింది. `మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే కొన్ని స్క్రిప్టులు విన్నాను. రెండు సినిమాలకు ఓకే చెప్పాను. అందులో ప్రభాస్ సినిమా ఒకటి` అని భాగ్యశ్రీ చెప్పింది. చాలా రోజుల వరకూ సినిమాలకు భాగ్యశ్రీ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీకి ఆమె సిద్ధమవుతున్నారు. ఇకపోతే.. రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీని ఈ సినిమాలోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. గతంలో ప్రభాసే ఈ విషయాన్ని తెలిపినట్లు అంతా చర్చించుకుంటున్నారు. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భాగ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో ఆమె ఈ సినిమా నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆమె ప్రభాస్‌కు తల్లిగా నటించనుందా ? మరేమైనా లాడ్ రోల్‌ చేయనుందా అన్ని మాత్రం విషయం ఇంకా తెలియలేదు. మొత్తానికి ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్లు స్వయంగా భాగ్యశ్రీయే ఇప్పుడు స్పష్టం చేయడంతో... ఈ సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు పెరుగుతన్నాయి.


from https://ift.tt/2T2M3Us

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages