హైదరాబాద్‌లో ప్రముఖ నటి కుమారుడికి కరోనా పాజిటివ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 12 May 2020

హైదరాబాద్‌లో ప్రముఖ నటి కుమారుడికి కరోనా పాజిటివ్

మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం (మే 11) ఒక్కరోజే హైదరాబాద్‌లో 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1275కు చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల పెరుగుదలపై నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. వీటిల్లో మూడోవంతు జియాగూడలోనే నమోదయ్యాయి. జియాగూడలో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. రోజురోజుకు ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. అయితే తాజాగా ఓ ప్రముఖ నటి కుమారుడు కూడా కరోనా బారిన పడిటన్లు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ పరిధిలోని ఓ అపార్టు మెంట్ లో 9 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. వీరిలో ఓ ప్రముఖ సినీనటి కుమారుడు కూడా ఉన్నారు. ఇటీవల ఆయన అత్తగారింటికి వచ్చారు. అయితే అక్కడ అతడికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే వైరస్ సోకినట్లు ఆయనకు తెలియకపోవడంతో అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న వారందరితో కలిసి సరదాగా గడిపారు. దీంతో అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న 27 మందిని కూడా వైద్యులు పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే ఈ విషయంలో అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఎవరి పేర్లనూ అధికారులు బయటకు చెప్పడం లేదు. హైదరాబాద్ జియాగూడ ప్రాంతంలో ఇప్పటివరకూ 68 కేసులు నమోదు అయ్యాయి. సోమవారం నాడే 25 వచ్చాయి. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించి, కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం 40 మంది కరోనా అనుమానితులకు ఆయుర్వేద ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మలక్ పేటలో పనిచేస్తున్న ఓ మహిళకు, సికింద్రాబాద్ లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ లో పనిచేస్తున్న ఆమె కుమార్తెకు వ్యాధి సోకింది. వెంటనే సదరు సెంటర్ ను అధికారులు మూసివేయించి, ఉద్యోగులను క్వారంటైన్ చేశారు. మూసాపేట, యూసుఫ్ గూడ, చాదర్ ఘాట్, మలక్ పేట, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.


from https://ift.tt/35SAfJA

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages