తెలిసి తెలిసి ఆ పని చేస్తానా.. బిగ్ బాస్ 4పై యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 16 May 2020

తెలిసి తెలిసి ఆ పని చేస్తానా.. బిగ్ బాస్ 4పై యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర భారీ పాపులారిటీ షో ఎంత సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందో అంతే వివాదాస్పదంగా కూడా మారుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కాదని, స్క్రిప్టెడ్ ప్రకారమే అంతా జరుగుతుందని చాలామంది కామెంట్ చేశారు. ఇంకొందరైతే బిగ్ బాస్ నిర్వాహకులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా చేసి రచ్చ చేశారు. ఇన్ని జరుగుతున్నా తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్స్ పూర్తిచేసుకున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం రెడీ అవుతోంది. దీంతో పార్టిసిపెంట్స్ విషయమై నిత్యం రకరకాల పేర్లు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో విషయమై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది . బిగ్ బాస్ గత సీజన్ ముగిశాక ఆ షోపై ఝాన్సీ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శ్రీముఖి బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చినా కూడా ఆమెకు ట్రోఫీ దక్కలేదని, ముందు నుంచి మూడు సీజన్లలో పురుషులకే ట్రోఫీ ఇస్తూ మహిళలను చిన్నచూపు చూస్తున్నారంటూ బిగ్ బాస్ యాజమాన్యంపై ఆమె విరుచుకుపడింది. ఈ క్రమంలో మరోసారి ఝాన్సీ అదే రేంజ్ రియాక్షన్ ఇవ్వడం విశేషం. Also Read: బిగ్ బాస్ సీజన్ 4లో మీకు అవకాశం ఇస్తే పోతారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''నన్ను బిగ్ బాస్ 1 కోసమే పిలిచారు. అప్పుడే పోలేదు. 4కి ఎందుకు వెళ్తా? తెలిసి తెలిసి రాయి ప‌ట్టుకొని ప‌ళ్లు ఊడ‌కొట్టుకుంటారా ఎవ‌రైనా..'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది . దీంతో.. ఏంటి? బిగ్ బాస్‌పై మీకు అంత అసహనం అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ''అది అవసరం లేదు. నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌న్ను నేను బాధ‌పెట్టుకోవ‌డం నాకస్సలు ఇష్టం లేదు. కొంతమంది మనుష్యుల మధ్యలో మనల్ని మనం బాధించుకోవడం వేస్ట్. అయినా నాకు నచ్చనప్పుడు నేను వెళ్లడం ఎందుకు?'' అంటూ షాకింగ్ సమాధానాలు చెప్పి మరోసారి వార్తల్లో నిలిచింది నిలిచింది ఝాన్సీ. ‌


from https://ift.tt/2WzxZE6

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages