కరోనాపై పోరు.. WHO ఈవెంట్‌కి షారుఖ్ ఖాన్ సపోర్ట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 16 April 2020

కరోనాపై పోరు.. WHO ఈవెంట్‌కి షారుఖ్ ఖాన్ సపోర్ట్

ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అశేష ప్రజానీకం ఒక్కటవుతోంది. అన్ని దేశాల్లోని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ పలువురు సెలబ్రిటీలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ కొందరు సాంగ్స్ విడుదల చేస్తుండగా, మరికొందరు కరోనాపై పోరాటానికి ఆర్ధిక మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తున్న కచేరీలో భాగం కాబోతున్నట్లు బాలీవుడ్ హీరో ప్రకటించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా బాధితులకు ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్లు, నర్సులకు, హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్ సభ్యులకు మద్దతు తెలుపుతూ (WHO), ఇంటర్నేషనల్‌ అడోకసి ఆర్గనైజేషన్‌ గ్లోబల్‌ సిటిజన్‌ సంస్థలు కలిసి ఓ వర్చువల్ కచేరీని నిర్వహిస్తున్నాయి. 'వన్‌ వరల్డ్‌ టుగెదర్‌ ఎట్‌ హోమ్‌' పేరిట జరగనున్న ఈ కచేరీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులను భాగం చేయనున్నారు. అయితే ఈ కచేరీలో తానూ భాగమవుతున్నట్లు షారుఖ్ వెల్లడించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనా ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బందికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశారు షారుఖ్. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపాలనుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 18వ తేదీ రాత్రి ఈ వర్చువల్ ఈవెంట్ జరగనుందని తెలిపారు.


from https://ift.tt/3amNdjy

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages