నాని సినిమాకు ఫుల్ డిమాండ్.. V మూవీకి అమెజాన్ భారీ ఆఫర్! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

నాని సినిమాకు ఫుల్ డిమాండ్.. V మూవీకి అమెజాన్ భారీ ఆఫర్!

నాచురల్ స్టార్ నాని హీరోగా మోహన‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'V' చిత్రానికి భారీ డిమాండ్ నెలకొంది. నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయబోతున్నామని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఉహించని విధంగా కరోనా విలయతాండవం చేయడం, ఆ కారణంగా థియేటర్స్ మూతపడటం జరిగాయి. దీంతో ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 'V' సినిమాపై ఉన్న అంచనాలను క్యాచ్ చేసుకునేలా అమెజాన్‌ ప్రైమ్ సంస్థ ఈ మూవీ హక్కులను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందట. ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ సంస్థ ఏకంగా రూ.35 కోట్లు ఆఫ‌ర్ చేసింద‌ని సమాచారం. అంతేకాదు థియేట‌ర్స్ లో విడుదల కావడం కంటే ముందుగానే త‌మ ఫ్లాట్‌ఫామ్‌లో 'V' చిత్రాన్ని విడుద‌ల చేసుకునేలా నిర్మాత‌ల‌తో సంప్ర‌దింపులు జరుపుతోందట అమెజాన్. అతిత్వరలో ఈ డీల్ సెట్ చేసి ఇంట్లోనే కుటుంబ సమేతంగా నాని V సినిమా చూసే అవకాశం కల్పించబోతోందట సదరు సంస్థ. అంటే నాని సినిమాకు ఏ రేంజ్ డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. Also Read: నాని కెరీర్ లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందించగా.. శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా వ్యవహరించారు. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు. 'సైరా నరసింహా రెడ్డి' ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ సినిమాలో నాని ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటం విశేషం. సో.. అమెజాన్ డీల్ సెట్ చేస్తే ఇక ఇంట్లోనే V మూవీ చూసేయొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో!.


from https://ift.tt/3a0xSov

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages