RRRలో నవదీప్..! క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 15 April 2020

RRRలో నవదీప్..! క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న మూవీపై వస్తున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి రెక్కలు కడుతున్నాయి. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత RRRతో రాబోతున్న జక్కన్న.. ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటూ ప్యాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అన్ని భాషల్లోని ఫేమస్ నటీనటులను భాగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందులో యంగ్ హీరో నటిస్తున్నాడనే వార్త వైరల్ అయింది. ఈ వార్త చూసి తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు నవదీప్. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న నవదీప్.. కండలు తిరిగిన తన దేహాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో RRR మూవీ కోసమే నవదీప్ ఇలా కండలు పెంచుతున్నాడనే టాక్ ముదిరింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన RRRలో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దీంతో అలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. Also read: ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. చెర్రీ సరసన ఆలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ చిందులేస్తోంది. భారీ బడ్జెట్ కేటాయించి డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే RRR టైటిల్ సీక్రెట్ రివీల్ చేస్తూ 'రౌద్రం రణం రుధిరం' అని ప్రకటించారు జక్కన్న. ఈ మేరకు విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు రాజమౌళి.


from https://ift.tt/3cnFEdO

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages