సుక్కుకి షాక్.. ‘పుష్ప’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

సుక్కుకి షాక్.. ‘పుష్ప’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి!

‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత డైరెక్టర్ సుకుమార్ కాస్త గ్యాప్ తీసుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా మొదలుపెట్టారు. దీనికి ‘పుష్ప’ అని ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇటీవల విడుడలైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ఫస్ట్‌ లుక్ పోస్టర్‌లో బన్నీ లుక్, మేనరిజం చూసి అంతా షాకయ్యారు. ‘రంగస్థలం’తో రామ్ చరణ్‌ను మార్చేసినట్టు.. ఈ సినిమాతో బన్నీని సుక్కు మార్చేశారని ప్రశంసించారు. సుకుమార్ పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క పోస్టర్ చాలని కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తమిళ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు సమాచారం. డేట్లు సర్దుబాటు కాకపోవడమే దీనికి కారణం అంటున్నారు. విజయ్ సేతుపతి తమిళంలో చాలా బిజీ ఆర్టిస్ట్. ఆయన చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన చాలా సినిమాలను అంగీకరించారట. అందులో ‘పుష్ప’ ఒకటి. ఈ సినిమా కోసం సర్దుబాటు చేసిన డేట్లు కరోనాతో కొట్టుకుపోయాయని సమాచారం. Also Read: కరోనా వైరస్ విజృంభించడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని వల్ల సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. వాటిలో ‘పుష్ప’ కూడా ఉంది. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. అందుకే, తాను ఇక డేట్లు సర్దుబాటు చేయలేనని, ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నానని సుకుమార్‌కు విజయ్ సేతుపతి చెప్పేశారట. అయితే, విజయ్ సేతుపతి పాత్రలో కచ్చితంగా ఒక తమిళ నటుడినే పెట్టాలని సుక్కు ఫిక్స్ అయ్యారని సమాచారం. దీని కోసం అరవింద స్వామి, బాబీ సింహా పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాగా, సుకుమార్ సమర్పణలో ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించారు.


from https://ift.tt/2xt2OR5

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages