హీరో ఇంట్లోనే మకాం పెట్టేసిన హాట్ బ్యూటీ.. ఆ నాలుగు గోడల మధ్య ఇద్దరూ! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 17 April 2020

హీరో ఇంట్లోనే మకాం పెట్టేసిన హాట్ బ్యూటీ.. ఆ నాలుగు గోడల మధ్య ఇద్దరూ!

కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పీరియడ్‌ని తనకు అనువుగా మార్చుకొని ఎంజాయ్ చేస్తోందట హాట్ బ్యూటీ . చిట్టిపొట్టి దుస్తులతో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్‌గా కనిపించే ఆ భామ ఏకంగా తన ప్రియుడి ఇంట్లోనే మకాం పెట్టిందని తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా టైగర్ ష్రాఫ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న దిశా, ఈ లాక్‌డౌన్ సమయం అంతా ప్రియుడికే కేటాయించిందట. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దిశా పటాని- టైగర్ ష్రాఫ్‌ జోడీ గురించి తెలియని ప్రేక్షకుడే ఉండడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కాకపోయినా డేటింగ్ వ్యవహారంతోనే జనం నోళ్ళలో నానిపోయింది ఈ ప్రేమ జంట. ఎవరికివారు కెరీర్ ప‌రంగా బిజీగా ఉంటూనే వీలుచిక్కినప్పుడల్లా అలా అలా షికారు చేయడం, చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ రొమాన్స్ చేయడం వీరిద్దరికీ అలవాటు. అలాంటిది ఒక్కసారిగా లాక్‌డౌన్ వచ్చిపడటంతో టైగర్ ష్రాఫ్‌ ఇంట్లోనే మకాం పెట్టేశారట. ఆ నాలుగు గోడల మధ్యనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా టాక్. Also Read: ఆ మధ్యకాలంలో దిశా పటాని- టైగర్ ష్రాఫ్‌ జోడీ బ్రేకప్ చెప్పుకుందనే వార్తలు కూడా షికారు చేశాయి. పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయగా.. టైగ‌ర్ ష్రాఫ్ త‌ల్లి అడ్డుపడటంతో ఈ జోడీ విడిపోయిందని మీడియాలో క‌థ‌నాలు చూశాం. కానీ తాజా సమాచారం ప్రకారం ఏకంగా ప్రియుడు టైగర్ ష్రాఫ్‌ ఇంట్లోనే రొమాన్స్ చేస్తోందంటే దిశా- టైగర్ ఒక్కటయ్యే రోజు దగ్గర్లోనే ఉందేమో అనిపిస్తోంది. చూద్దాం మరి మున్ముందు ఏం జరగనుందో!.


from https://ift.tt/2yj6epI

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages