రెచ్చిపోయిన హీరో.. రష్మిక మందనపై దారుణంగా! ముదురుతున్న వివాదం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 12 April 2020

రెచ్చిపోయిన హీరో.. రష్మిక మందనపై దారుణంగా! ముదురుతున్న వివాదం

క్రేజీ బ్యూటీ రష్మిక మందనను ఓ హీరో దారుణంగా టీజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోలోని సన్నివేశాలు చూసి మహిళా సంఘాలు, నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. నిజానికి ఇది నటిస్తున్న కొత్త సినిమాలోని వీడియో సాంగ్. ఇటీవలే ఈ సాంగ్ విడుదల చేయడంతో రచ్చ మొదలైంది. రష్మిక మందనపై మీద మీద పడుతూ హీరో రెచ్చిపోతున్న తీరు విమర్శలకు తావిచ్చింది. వెంటనే సినిమా నుంచి ఈ వీడియో సాంగ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు. తెలుగుతో పాటు క‌న్న‌డ‌ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. ప్రస్తుతం 'పొగరు' అనే కన్నడ సినిమా చేస్తోంది. నంద కిషోర్ దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఇటీవలే మాస్ మసాలా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో హీరోయిన్ రష్మికను హీరో ధ్రువ సర్జా టీజ్ చేయడం, దారుణంగా హింసించడం లాంటి సన్నివేశాలు చూపించడంతో ఈ ఇష్యూ రచ్చెకెక్కింది. ఓ వైపు భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటూ విడుదలైన వారం రోజుల్లోనే ఈ పాటకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చినప్పటికీ, మహిళామణుల ఆగ్రహానికి గురవుతోంది ఈ సాంగ్. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈ పాటను చిత్రీకరించారని పెద్దఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఓ అమ్మాయిని ఇంత దారుణంగా ఏడిపించడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకుల్లో హింసాత్మక ధోరణిని పెంపొందిస్తాయని పేర్కొంటూ వెంటనే ఈ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు. ఇప్పటికే సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు ఇలాంటి పాటలు మరింత ఊతమిస్తాయని పేర్కొంటూ ఈ పాటపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ 'పొగరు' సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న క్రమంలో కరోనా ఎఫెక్ట్, మహిళా సంఘాల డిమాండ్స్ చూసి దర్శకనిర్మాతలు తలపట్టుకుంటున్నారు. చూడాలి మరి ఈ పాటను సినిమా నుంచి తొలగిస్తారా? లేదా? అనేది.


from https://ift.tt/2JZ9t8d

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages