బాలీవుడ్ స్టార్ హీరో మరదలి ఇంట్లో కరోనా కలకలం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 15 April 2020

బాలీవుడ్ స్టార్ హీరో మరదలి ఇంట్లో కరోనా కలకలం

రేపుతోంది. ముందుగా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడింది. ఆమెకు ఐదుసార్లు టెస్టులు చేస్తే తప్పా కరోనా నెగిటివ్ అని తేలలేదు. ఆమె అలా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే... బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరీమ్ మోరాని ఫ్యామిలీ కరోనా బారిన పడింది. కరోనా సోకి కరీమ్ మోరాని పెద్ద కూతురు షాజా మోరాని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె చెల్లి, తండ్రికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో వారిద్దర్నీ ఐసోలేషన్‌కు తరలించారు. ఇద్దరు కూతుళ్లు డిశ్చార్జ్ కాగా.. కరీమ్ మోరాని మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ ఫ్యామిలీలో కరోనా కలవరం సృష్టిస్తోంది. నటుడు సంజయ్‌ఖాన్ కూతురు, హృతిక్ రోషన్ మాజీ భార్య సుజేఖాన్‌ సోదరి ఫరాఖాన్ అలీ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు తన కుటుంబ సభ్యులు కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నారని ఫరాఖాన్ అలీ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తామంతా క్వారంటైన్‌లో ఉన్నామన్నారు. దీనిపై నటి పూజా బేడీ స్పందిస్తూ.. ధృడంగా ఉంటూ, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లండని ధైర్యం చెప్పింది. ఇది మీరు ప్రస్తుత పరిస్థితిని జయించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. మరోవైపు ఎందరో నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా మెసేజులు పెడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు 11వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 400కు చేరువలో ఉంది. అత్యధికంగా మహరాష్ట్రలో కరోనా కేసులు నమోదువుతున్నాయి. దీంతో కేంద్రం సైతం లాక్ డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడిగిస్తూ మంగళవారం ప్రకటన చేసింది.


from https://ift.tt/2XDSq3A

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages