విడుదలకు నోచుకోని తమిళ సినిమా రీమేక్.. రవితేజ హీరో - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 7 April 2020

విడుదలకు నోచుకోని తమిళ సినిమా రీమేక్.. రవితేజ హీరో

తమిళంలో 2014లో ‘సతురంగ వెట్టాయి’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమా ద్వారా హెచ్. వినోద్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ టాలెండెట్ డైరెక్టర్ తరవాత ‘తీరం’, ‘నేర్కొండ పార్వాయి’ వంటి సూపర్ హిట్స్‌ను తెరకెక్కించారు. అయితే, ‘సతురంగ వెట్టాయి’కి సీక్వెల్ తీయాలని నిర్మాత మనోబాల ప్లాన్ చేశారు. అనుకున్నట్టే 2017లో ‘సతురంగ వెట్టాయి 2’ మొదలుపెట్టారు. ఈ సినిమాలో అరవింద స్వామి, త్రిష జంటగా నటించారు. ఎన్.వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాత మనోబాల, హీరో అరవింద స్వామి మధ్య ఏవో విభేదాలు రావడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ సినిమా రీమేక్ హక్కులను విక్రయించాలని నిర్మాత నిర్ణయించారు. ‘సతురంగ వెట్టాయి 2’ తెలుగు రీమేక్ హక్కులను దర్శకుడు రమేష్ వర్మ కొనుగోలు చేసినట్టు తెలిసింది. మాస్ మహారాజా రవితేజతో ఈ సినిమాను రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. రవితేజతో తాను సినిమా చేస్తున్నట్టు రమేష్ వర్మ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. అది ఒక రీమేక్ సినిమా అని అప్పట్లో టాక్ వినిపించింది. అది ‘సతురంగ వెట్టాయి 2’ రీమేక్ అని ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌ను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఏడాదే సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. Also Read: ఇదిలా ఉంటే, గతేడాది ‘రాక్షసుడు’ సినిమాతో రమేష్ వర్మ హిట్ అందుకున్నారు. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా తమిళ సినిమా ‘రాచ్చసన్’కు రీమేక్. అలాగే, రవితేజతోనూ గతంలో రమేష్ వర్మ పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వీర’ సినిమా వచ్చింది. కాగా, ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను బి.మధు నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


from https://ift.tt/2Rlkq8i

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages