చినమామతో ఆ సినిమా చేయడమే తప్పు: సుమంత్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

చినమామతో ఆ సినిమా చేయడమే తప్పు: సుమంత్

అక్కినేని హీరోలు నాగార్జున, సుమంత్ కథానాయకులుగా 2001లో విడుదలైన సినిమా ‘స్నేహమంటే ఇదేరా!’. నాగ్, సుమంత్ కాంబోలో వచ్చిన ఏకైక సినిమా ఇది. మలయాళ సినిమా ‘ఫ్రెండ్స్’కు ఇది రీమేక్. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మించారు. అయితే, ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా గురించి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సుమంత్ స్పందించారు. అసలు ఆ సినిమా చేయడమే తప్పని అన్నారు. అసలు నాగార్జున, తను స్నేహితులమంటే ప్రేక్షకులు అంగీకరించరని చెప్పారు. అలాగే, స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా ఏమీ లేదని వెల్లడించారు. ‘‘కొన్ని అలా జరుగుతాయి. చినమావయ్య (నాగార్జున) అప్పుడు సూపర్ గుడ్ ఫిలింస్‌లో వరుసగా రెండు హిట్లు కొట్టారు. ‘స్నేహమంటే ఇదేరా!’తో దాన్ని కంటిన్యూ చేద్దామని ఆయన అనుకొని ఉంటారు. ఇదే సినిమా తమిళంలో బాగా ఆడింది. విజయ్, సూర్య చేశారు. కానీ, తెలుగులో ట్రాన్స్‌లేట్ అవ్వలేకపోయింది. మా ఇద్దరినీ ఫ్రెండ్స్‌లా చూడటం కష్టం. కొన్ని సీన్స్ ఇబ్బందికరంగా ఉంటాయి. సెకండాఫ్‌లో నేను చినమావయ్యని కొడతాను. దాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారని నేను అనుకోను. మేనల్లుడు అయ్యుండి మావయ్యను కొడతాడా అని మన ఆడియన్స్ ఆలోచిస్తారు. నిజానికి సెట్‌లో కూడా ఆ సీన్ చేయడానికి ఇబ్బందిగా అనిపించింది’’ అని సుమంత్ చెప్పుకొచ్చారు. Also Read: తాను చినమావయ్యతో ఒకటి, తాతతో ఒక సినిమా చేశానని.. ఆ రెండూ ఇబ్బందికరంగానే అనిపించాయని సుమంత్ వెల్లడించారు. ‘‘నిజానికి ఆ రెండు సినిమాల స్క్రిప్ట్‌లు బలంగా లేవు. తాతతో ‘పెళ్లి సంబంధం’ సినిమా చేశాను. అది కేవలం తాతతో, రాఘవేంద్రరావు గారితో పనిచేయాలని చేశాను. కానీ, స్క్రిప్ట్‌లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా ‘స్నేహమంటే ఇదేరా!’ సినిమా చినమావయ్యతో పనిచేయాలని నాకు నేను ఫోర్స్ చేసుకుని చేశాను. ఈ రెండు సినిమాలు నన్ను నిరుత్సాహానికి గురి చేశాయి’’ అని సుమంత్ చెప్పారు.


from https://ift.tt/2wwF0v0

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages