మరో మల్టీస్టార్ చేయబోతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

మరో మల్టీస్టార్ చేయబోతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ?

టాలీవుడ్ టాప్ యంగ్ హీరోస్ సినిమాలు వస్తున్నాయంటే అభిమానులకు పండగే. ఇక అలాంటి అభిమాన హీరోలు కలిసి నటిస్తుంటే... ఇక ఆ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న సినిమా RRR... రౌద్రం రణం రుధిరం. దర్శకు ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మూవీ విడుదలకు ముందే చరణ్, తారక్ తమ ఫ్యాన్స్‌కు మరో శుభవార్త చెప్పేలా ఉన్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో మరో మల్లీ స్టారర్ మూవీ కూడా వస్తుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలని ఒకే తెరపై చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌,రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో మరో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్న వ్యక్తి త్వరలో రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఇద్దరు హీరోలని కలిసి ఆ దర్శకుడు స్టోరీ లైన్ కూడా చెప్పాడని సమాచారం. చరణ్, ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గ మరో కథను కూడా ఓ రచయత రెడీ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ మల్టీస్టారర్ పై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో అంతా అనుకున్నట్లు జరిగితే.... RRRతో పాటు మరో సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించనున్నారు.


from https://ift.tt/2xjMUIO

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages