హీరోయిన్ అన్నాక అలాంటివి మామూలే.. అలవాటైపోయింది: రష్మిక మందన - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 16 April 2020

హీరోయిన్ అన్నాక అలాంటివి మామూలే.. అలవాటైపోయింది: రష్మిక మందన

'ఛలో' సినిమాతో టాలీవుడ్ తెరపై అడుగుపెట్టింది కన్నడ భామ . తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న ఈ సుందరి.. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. ''గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' లాంటి సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్ స్థాయికి తీసుకెళ్లి బిజీ హీరోయిన్‌ని చేసేశాయి. ఈ క్రమంలో రష్మిక క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ పెద్దఎత్తున రూమర్స్ పుట్టిస్తున్నారు గాసిప్ రాయుళ్లు. రష్మిక మందన చేయబోతున్న సినిమాలు, రెమ్మ్యూనరేషన్ సంగతులు అలాగే ఆమె ప్రేమ, పెళ్లి తాలూకు ముచ్చట్ల వరకు ఎన్నో ఎన్నో గాసిప్స్ పుట్టిస్తున్నారు. దీంతో తాజాగా తనపై వస్తున్న తప్పుడు వార్తలు, గాసిప్స్ గురించి స్పందించింది రష్మిక. ఇండస్ట్రీలోని ప్రతీ హీరోయిన్‌కీ ఇలాంటి సమస్యలు తప్పవని ఆమె అంటోంది. అయినా ఇప్పుడు వాటిని పట్టించుకునే తీరిక, సమయం తనకు లేదని రష్మిక మందన పేర్కొంది. ''హీరోయిన్‌ అన్నాక వ్యక్తిగతంగా ఏదో ఒకరూపంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. రోజుకో రకమైన వార్త కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాటి గురించి నేనైతే అస్సలు పట్టించుకోను. షూటింగ్ షెడ్యూల్స్‌ ప్లానింగ్‌, సమయానికి లొకేషన్ వెళ్లి షూటింగ్ ఫినిష్ చేయడం లాంటి వాటితోనే సమయం గడిచిపోతోంది. కొన్నిసార్లు తినడం కూడా మర్చిపోతున్నా. ఇక ఇలాంటి గాలి వార్తలు పట్టించుకునే సమయం ఎక్కడుంది?. ఇలాంటి వార్తలు చూసి మొదట్లో కొంచెం బాధ పడేదాన్ని. కానీ ఆ తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు అవేవీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతున్నా'' అని రష్మిక తెలిపింది. Also Read: ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '' మూవీలో నటిస్తోంది రష్మిక. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ రూపొందుతోందని టాక్. ఇటీవలే విడుదల చేసిన 'పుష్ప' ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. కరోనా కారణంగా ఈ చిత్ర తదుపరి షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి.


from https://ift.tt/2XOQs0a

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages