నయనతార లవ్ ఫెయిల్యూర్.. అందుకే ఆ ఇద్దరితో!! హీరోయిన్ షాకింగ్ రియాక్షన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

నయనతార లవ్ ఫెయిల్యూర్.. అందుకే ఆ ఇద్దరితో!! హీరోయిన్ షాకింగ్ రియాక్షన్

సినీ తారలపై ప్రేమ ముచ్చట్లు, డేటింగ్ సంగతులు ఎన్నెన్నో వింటుంటాం. అందాల భామల డేటింగ్ ముచ్చట్లంటే ప్రేక్షకులకూ అమితమైన ఆసక్తే. అందుకే హీరోయిన్స్ సీక్రెట్స్ అంటూ వస్తున్న వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియన్ బడా యాక్ట్రెస్ ప్రేమ గురించి వచ్చినన్ని వార్తలు మరే హీరోయిన్ గురించీ రాలేదనడంలో అతిశయోక్తి లేదు. నయన్ కెరీర్ ఆరంభం నుంచే ప్రేమ సంగతులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఇద్దరు హీరోలతో బ్రేకప్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లవ్ ఫెయిల్యూర్ విషయమై స్పందించింది. కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించింది నయనతార. ఇద్ద‌రూ చెట్ట‌ప‌ట్టాలేసుకు తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత అతినికి బ్రేకప్ చెప్పిన నయన్.. మరో హీరో, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం కూడా పీక్స్‌కి వెళ్లి, పెళ్లి వార్తల వరకూ పోయింది. ఇంతలో సడెన్‌గా ఏమైందో ఏమో గానీ ఆ ప్రేమకు కూడా ఫుల్‌స్టాప్ పడింది. దీంతో నయనతార లవ్ ఫెయిల్యూర్ వ్యవహారాలపై పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన లవ్ ఫెయిల్యూర్స్ విషయమై స్పందించిన నయనతార కాస్త ఆవేదన చెందింది. నమ్మకం లేని చోట ప్రేమ నిలవదని చెబుతూ తన ప్రేమ విఫలం కావడానికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడమే కారణమని కుండబద్దలు కొట్టేసింది. నమ్మకం లేకుండా కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మంచిదని వారితో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నానని నయనతార చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలో తాను ఎంత బాధ అనుభవించానో తనకు మాత్రమే తెలుసని చెప్పింది నయన్. ఆ బాధ నుంచి బయటకు రావడానికి తనకు చాలా కాలమే పట్టిందని, సినిమాలే తనను తిరిగి మనిషిని చేశాయని ఆమె తెలిపింది. అభిమానులు ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నారని నయనతార చెప్పింది. ఇకపోతే ప్రస్తుతం నయనతార.. విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తోందని మరో రూమర్ చెక్కర్లు కొడుతోంది.


from https://ift.tt/2VrpJE7

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages