పెళ్లికి డబ్బున్నోల్లే కావాలి.. కానీ దానికి మాత్రం: హీరోయిన్లపై శ్రీ రెడ్డి అటాక్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 17 April 2020

పెళ్లికి డబ్బున్నోల్లే కావాలి.. కానీ దానికి మాత్రం: హీరోయిన్లపై శ్రీ రెడ్డి అటాక్

సోషల్ మీడియా ఆటం బాంబ్ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. సమయం, సందర్భం లేకుండా హీరోయిన్లపై విరుచుకుపడింది. నేటితరం హీరోయిన్లు డబ్బున్నోళ్లనే పెళ్లి చేసుకుంటారని పేర్కొంటూ తన ఫేస్‌బుక్‌లో వరుస కామెంట్స్ చేసింది. వాళ్లది స్వార్థపూరిత ధోరణి అని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవద్దని సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లపై ఆమె చేసిన ఈ కామెంట్స్ చూసి నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి నువ్వెలాంటి మగాడిని పెళ్లాడతావని ప్రశ్నిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ బడా దర్శకనిర్మాతలను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. అప్పట్లో నానా రచ్చ చేసింది. నిర్మాత సురేష్ బాబు కొడుకు తనను లైగికంగా వాడుకొని వదిలేశాడని ధర్నాకు దిగింది. నడిరోడ్డుపై అర్థనగ్నంగా నిరసన తెలిపి అనూహ్యంగా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి, హైదరాబాద్‌కి బై బై చెప్పేసి చెన్నైలో సెటిలైంది. ఆపై తన సోషల్ మీడియానే అస్త్రంగా వాడుతూ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. Also Read: ఈ క్రమంలోనే హీరోయిన్లందరిపై కామెంట్ చేసి మరోసారి జనం నోళ్ళలో నానుతోంది శ్రీ రెడ్డి. 99 శాతం మంది హీరోయిన్లు ధనవంతులనే పెళ్లి చేసుకుంటారు.. కానీ వారి సినిమాలు చూసేందుకు, టికెట్స్ కొనేందుకు మాత్రం పేద అబ్బాయిలే కావాలంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. అలాంటి హీరోయిన్లను స్ఫూర్తిగా తీసుకొనే సాధారణ మహిళలు కూడా చెడిపోతున్నారు.. ప్రతీ ఒక్కరికీ డబ్బున్న మొగుళ్లే కావాలి, డబ్బులేని వారు చచ్చిపోతున్నారంటూ మరో పోస్ట్ చేసింది ఈ వివాదాస్పద నటి. సందర్భం ఏంటో తెలియదు కానీ శ్రీ రెడ్డి ఇలా కామెంట్స్ చేయడం నెటిజన్లకు మింగుడుపడటం లేదు. నువ్వు మాత్రం పేదవాడిని పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకొందరు మాత్రం శ్రీ రెడ్డి కరెక్ట్ చెప్పింది. బయట జరుగుతున్న వాస్తవం అదే అని రిప్లై ఇస్తున్నారు. ఇక శ్రీ రెడ్డి వేసిన ఈ ఆటం బాంబ్ మహిళా మణులకైతే చిర్రెత్తే కోపం తెప్పిస్తోంది.


from https://ift.tt/2ymgGN0

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages