బోయపాటి సినిమాలో బాలయ్య విలన్.. ఇదిగో క్లారిటీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

బోయపాటి సినిమాలో బాలయ్య విలన్.. ఇదిగో క్లారిటీ

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గత రెండు చిత్రాల్లో బాలకృష్ణను సరికొత్త అవతారాల్లో చూపించిన బోయపాటి.. ఈ సినిమాలోనూ డిఫరెంట్ షేడ్స్‌లో ఆయన్ని ఆవిష్కరిస్తున్నారని ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారని, అంతేకాకుండా మెయిన్ విలన్‌గా ఆయనే నటిస్తున్నారని ఈమధ్య రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, బాలయ్య విలన్‌ పాత్ర పోషిస్తున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఈ సినిమాకు సంబంధించిన వ్యక్తుల ద్వారా తెలిసింది. బాలకృష్ణ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. అయితే, ఆయన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. మొదట ఆయన పాత్రను నెగిటివ్‌గా చూపించి ఆ తర్వాత అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో రివీల్ చేస్తారట. అంతేకానీ, ఇది విలన్ రోల్ కాదని సమాచారం. బోయపాటి తనదైన శైలిలో ఈ సినిమాలో ట్విస్టులను జోడిస్తున్నారట. బాలయ్యను గతంలో చూడని విధంగా ఆవిష్కరిస్తున్నారట. Also Read: ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే, రెండో షెడ్యూల్‌కు కరోనా వైరస్ రూపంలో అడ్డంకి వచ్చింది. కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో టాలీవుడ్‌లో షూటింగ్‌లన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా ఇళ్లకే పరిమితమైంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ వారణాసిలో ఉంటుందని, ఇప్పటికే బోయపాటి లొకేషన్స్‌ను కూడా ఓకే చేశారని వార్తలు వచ్చాయి. మరి, వారణాసి షెడ్యూల్ ఎప్పుడుంటుందో చూడాలి. కాగా, ఈ సినిమాకు ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత.


from https://ift.tt/3b3kmSg

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages