లాక్ డౌన్ వేళ కారులో హీరోయిన్ షికార్లు... అంతలోనే రోడ్డు ప్రమాదం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 4 April 2020

లాక్ డౌన్ వేళ కారులో హీరోయిన్ షికార్లు... అంతలోనే రోడ్డు ప్రమాదం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నా కొందరు అవేం పట్టించుకోకుండా యధేచ్ఛగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ షర్మిలా మాండ్రే కూడా అర్థరాత్రి కారు తీసుకొని షికార్లు చేయడానికి రొడ్డెక్కింది. అనుకోకుండా ఆమె కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బెంగుళూరులోని వసంత్ నగర్ రైల్వేబ్రిడ్జి వద్ద జరిగింది. అర్థరాత్రి 3 గంటల ప్రాంతంలో షర్మిల, అతని స్నేహితుడు లోకేశ్ వసంత్‌తో కలిసి జాగ్వార్ కారులో సరదాగా షికార్లు చేసింది. ఆ సమయంలో కారు బలంగా వెళ్లి ఒ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న ఓ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జనుజ్జయింది. దీంతో షర్మిలతోపాటు ఆమె ఫ్రెండ్ లోకేష్ వసంత్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. షర్మిల, లోకేష్‌లను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు... ఘటనపై ఆరా తీస్తున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ వేకువజామున 3 గంటల సమయంలో వీరు బయట ఎందుకు తిరుగుతున్నారు? ఆ సమయంలో ఎక్కడికి వెళ్లివస్తున్నారన్న విషయమై పోలీసులు విచారిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారా? అనే కోణంలోనూ కూడా చేస్తున్నారు. హీరోయిన్ షర్మిలా మాండ్రే తెలుగులో అల్లరి నరేష్‌ హీరోగా 2013లో తీసిన 'కెవ్వుకేక' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో సొంత భాష కన్నడ సినిమాలవైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.


from https://ift.tt/39I9o36

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages