రీల్ హీరో కాదు రియల్ హీరో సజ్జనార్: ఆర్జీవీ ఫిదా - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 15 April 2020

రీల్ హీరో కాదు రియల్ హీరో సజ్జనార్: ఆర్జీవీ ఫిదా

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరిలో తెలియకుండానే గౌరవ భావం కలుగుతుంది. నేరస్థుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఆయనకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. వరంగల్‌లో యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌తో సజ్జనార్ పేరు పాపులర్ అయ్యింది. ఇటీవల దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశ వ్యాప్తంగా సజ్జనార్ పేరు మారుమోగిపోయింది. సాధారణ ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ జాబితాలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా సజ్జనార్‌ను ఆయన పొగుడుతూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆయనకు అవకాశం వచ్చింది. కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ లాక్‌డౌన్‌ను పాటించడం ఎంత అవసరమో తెలియజేస్తూ సైబరాబాద్ పోలీసులు ఒక పాటను విడుదల చేశారు. ‘ఓరి ఓరి నా ఫ్రెండు’ అంటూ సాగే ఈ పాటను సైబరాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తోన్న సబ్ ఇన్‌స్పెక్టర్ లాల్ మధార్ రాశారు. హుషారైన ట్యూన్‌తో ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాటను మంగళవారం కమిషనర్ సజ్జనార్ విడుదల చేశారు. అంతేకాదు, యూబ్యూట్‌లో అప్‌లోడ్ చేసిన ఈ పాటను సైబరాబాద్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఆర్జీవీ స్పందించారు. Also Read: ‘‘కరోనా వైరస్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని, లాక్‌డౌన్‌పై ఫ్రెండ్లీ సబ్ ఇన్‌స్పెక్టర్ లాల్ మధార్ ‘నా ఫ్రెండ్’ అనే సూపర్ సాంగ్ రాశారు. ఈ పాటను ఎవరో సినిమా రీల్ హీరో విడుదల చేయలేదు. నిజంగా రియల్ హీరో, ది గ్రేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ విడుదల చేశారు. కచ్చితంగా వినాల్సిన, షేర్ చేయాల్సిన పాట’’ అని ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వర్మ ట్వీట్‌కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


from https://ift.tt/2VpMNTW

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages