హత్య చేసిన హీరో.. ఆ వెంటనే! ఆసక్తి రేపుతున్న మోహన్‌ దాస్ టీజర్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 12 April 2020

హత్య చేసిన హీరో.. ఆ వెంటనే! ఆసక్తి రేపుతున్న మోహన్‌ దాస్ టీజర్

ఈ రోజుల్లో వాస్తవ కథ ఆధారంగా ద్వారా తెరకెక్కుతున్న సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఉంది. దాన్ని క్యాచ్ చేసుకునేలా ఆసక్తికర కథాంశాలను ఎంచుకుంటూ వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. అలా వస్తున్న కొత్త సినిమానే 'మోహన్‌ దాస్'. హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ.. టీజర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ఒక నిమిషం 20 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో కేవలం హీరో విష్ణు విశాల్ తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. 'చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు' అని చెప్పడానికి సింబాలిక్‌గా వాడే మూడు కోతిబొమ్మలను చూపిస్తూ ఈ టీజర్‌ని ఎంతో ఆసక్తికరంగా కట్ చేశారు. విష్ణు విశాల్ సుత్తెతో ఎవరినో చంపుతున్న సీన్ చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. హీరో చేతులన్నీ రక్తంతో తడిచిపోవడం, వెనకనుంచి ఎవరో వెకిలిగా నవ్వినట్లు వినిపిస్తుండటం చూస్తుంటే ఇది ఓ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. 'ఈ రోజు మీరు ఏం చేతారో దానిపైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది' అని మహాత్మ గాంధీ చెప్పిన కొటేషన్ చూపిస్తూ స్టార్ట్ అయిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. హీరో విష్ణు విశాల్ ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగమవుతుండటం విశేషం. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ముర‌ళీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ సుందర‌మూర్తి సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివరాలు అతిత్వరలో ప్రకటించనున్నారు.


from https://ift.tt/2RxbcWp

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages