లాస్ ఏంజెల్స్‌లో మంచు విష్ణు ‘మోసగాళ్లు’ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 5 February 2020

లాస్ ఏంజెల్స్‌లో మంచు విష్ణు ‘మోసగాళ్లు’

హీరో మంచు విష్ణు ఒక హాలీవుడ్-ఇండియన్ మూవీని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘మోసగాళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. మంచు విష్ణుకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను లాస్ ఏంజెల్స్‌లో తాజాగా ప్రారంభించారు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఈ సినిమా ఛేదిస్తుంది. ఈ లాస్ ఏంజెల్స్ షెడ్యూల్ 10 రోజుల పాటు జరుగుతుంది. ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు అందాల తార కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొద్ది నెలలుగా జరుగుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. సినిమాలో విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ చాలా ఇన్టెన్స్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. Also Read: మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తోన్న ‘మోసగాళ్లు’ చిత్రంలో నవదీప్, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మంచు విష్ణుకు పెద్దగా మార్కెట్ లేదు. తెలుగులో ఆయన హిట్ అందుకుని చాలా సంవత్సరాలు అయ్యింది. 2012లో వచ్చిన ‘దేనికైనా రెడీ’ సినిమా తరవాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు విష్ణు. కిందటేడాది ‘ఓటర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతానికి అయితే మంచు విష్ణు సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి అయితే లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఒక వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడమంటే రిస్కే. చూద్దాం విష్ణు ఏ మేర ఆకట్టుకుంటారో!


from https://ift.tt/2GVKP6X

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages