శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 7 February 2020

శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్

దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇచ్చారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో తన భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హలతో పాటు దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు బన్నీ, త్రివిక్రమ్‌కు స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనమైన వెంటనే వారు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది. READ ALSO: ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా అభివర్ణిస్తున్నారు. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ టైమింగ్‌తో సినిమా అల.. కుదిరిపోయిందంతే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. టబు, నవదీప్, నివేదా పేతురాజ్, సుశాంత్, మురళీ శర్మ సహాయ పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా బన్నీ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు అందరికీ పార్టీ ఇచ్చారు. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్లకు కూడా పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయింది. హీరోయిన్, టైటిల్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో పాటు బన్నీ.. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలోనూ నటించనున్నారు. ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించనున్నారు.


from https://ift.tt/377LYTE

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages