దావూద్‌ పక్కన స్టార్ హీరో.. కూతుర్ని టార్గెట్ చేసిన నెటిజన్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 3 February 2020

దావూద్‌ పక్కన స్టార్ హీరో.. కూతుర్ని టార్గెట్ చేసిన నెటిజన్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ గత రెండు రోజులుగా ట్విటర్లో నెటిజన్స్‌తో మాటల యుద్ధం చేస్తున్నారు. దిల్లీలోని షహీన్‌బాగ్, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పులు జరిగిన ఘటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో ఇలాంటి సంఘటన జరుగుతుందని నేను అస్సలు ఊహించలేకపోయా. ఇలాంటి భయంకరమైన రాజకీయాలు ఆపండి. వీటి వల్ల దేశంలో ద్వేషం పెరిగిపోతోంది. మిమ్మల్ని మీరు హిందూ అని భావిస్తే ఆ మతం మనకు కర్మ, ధర్మ గురించి ఏం చెబుతోందో తెలుసుకోండి’ అని ట్వీట్ చేశారు. అయితే సోనమ్ అభిప్రాయాలను కొందరు గౌరవిస్తుంటే మరికొందరు మాత్రం ఫేక్ హిందూ అంటూ ఏకిపారేస్తున్నారు. ఇందుకు కారణం కొన్నేళ్ల క్రితం ఓ క్రికెట్ మ్యాచ్‌లో ముంబై అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పక్కన అనిల్ కపూర్ నిలబడి ఫొటో దిగడమే. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ సోనమ్‌ను తిట్టిపోశారు. దాంతో ఈ ఫొటో వెనకాల ఉన్న కథను వివరించి సోనమ్ నెటిజన్ల నోరు మూయించారు. READ ALSO: ‘‘మా నాన్న రాజ్ కపూర్, క్రిష్ణా కపూర్‌తో కలిసి భారతీయ క్రికెట్ మ్యాచ్‌కి వెళ్లారు. పక్కన, వెనక ఎవరు ఉన్నారో మా నాన్నకు తెలీకుండానే ఫొటో తీశారు. ఒకరిపై వేలెత్తి చూపడం ఆపండి. ఎందుకంటే మిగతా మూడు వేళ్లు మీ వైపే ఉంటాయి. ఇలాంటి ద్వేషపూరిత ఆలోచనలు ఉన్న మీలాంటివారిని రాముడు క్షమించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


from https://ift.tt/2GUnYbX

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages