దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR విడుదల వాయిదా పడుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా RRR వాయిదా పడుతున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. దీంతో సినిమా వాయిదాపై అందరికీ క్లారిటీ వచ్చింది. మహా అయితే రెండు మూడు నెలలు వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ, ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు రాజమౌళి. సినిమా విడుదలను ఏకంగా 2021కి వాయిదా వేసేశారు. 2021 జనవరి 8న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
from https://ift.tt/3764VWU
No comments:
Post a Comment