‘పోన్లే.. బుగ్గ మీద ముద్దిచ్చి ఊరుకున్నాడు’ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Wednesday, 23 October 2019

demo-image

‘పోన్లే.. బుగ్గ మీద ముద్దిచ్చి ఊరుకున్నాడు’

Responsive Ads Here
photo-71733298
ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో ‘ఇండియన్ ఐడల్’లో ఓ వ్యక్తి గాయని నేహా కక్కర్ నడుం పట్టుకుని ముద్దు పెట్టుకున్న ఘటన ఎంత వైరల్‌గా మారిందో తెలిసిందే. దీనిపై తాజాగా ప్రముఖ సింగర్ స్పందించారు. గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడైన ఆదిత్య.. ఈ ఘటన జరిగిన రోజున పక్కనే ఉన్నాడు. నేహాను ఆ వ్యక్తి ముద్దుపెట్టుకుంటున్నప్పుడు అతను వెళ్లి నేహాను కాపాడాడు. దీనిపై తాజాగా ఆయన స్పందిస్తూ.. ‘నేను నేహాను కాపాడటానికి వెళ్లాను. కానీ ఆ తర్వాత జరిగిన దానికి నేనేమీ చేయలేను. నేహాను ముద్దు పెట్టుకున్న వ్యక్తి చేతిపై ఆమె పేరుతో టాటూ కూడా ఉంది. కాబట్టి అతను నేహాకు వీరాభిమాని అయివుంటాడు. ఆ అభిమానంతోనే అలా ముద్దుపెట్టుకుని ఉంటాడు. అలా చేయడం వెనక దురుద్దేశం లేదని నా అభిప్రాయం. పోన్లే అతను నేహా బుగ్గపై ముద్దు ఇచ్చి ఊరుకున్నాడు. అంతకుమించి ఏమన్నా చేసుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. నేహాది మంచి మనసు కాబట్టి అతని అభిమానం చూసి ఏమీ అనకుండా వదిలేసింది. ఏదేమైనా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా మేం జాగ్రత్త పడతాం’ అని వెల్లడించారు. ఐడల్ సీజన్ 11కు నేహా కక్కర్ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఈ షో ఆడిషన్స్‌లో భాగంగా ఓ వ్యక్తి రాజస్థానీ ఫోక్ గెటప్ వేసుకుని స్టేజ్‌పైకి వచ్చాడు. అతను వచ్చిన పని చూసుకుని వెళ్లిపోకుండా నేహాను ఓసారి స్టేజ్‌పైకి రమ్మన్నాడు. తన అభిమాని అయివుంటాడని భావించిన నేహా స్టేజ్‌పైకి వెళ్లింది. ‘నన్ను గుర్తుపట్టారా?’ అని అడిగాడు. అప్పుడు నేహా ‘లేదు’ అంది. అక్కడితో వదిలేయకుండా నేహా చెయ్యి పట్టుకుని చాలా సేపటి వరకు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆ తర్వాత నేహాకు టెడ్డీబేర్ బొమ్మను కానుకగా ఇచ్చాడు. అతను అక్కడితో ఆగలేదు. ‘ఒక హగ్ ఇస్తారా’ అని అడిగాడు. పాపం నేహా ఏదో ఫ్రెండ్లీగా హగ్ ఇద్దామనుకుంది. ఇంతలో అందరూ చూస్తున్నారన్న భయం కూడా లేకుండా ఆ వ్యక్తి నేహా నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని బుగ్గపై ముద్దు పెట్టాడు. దాంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. వెంటనే షాక్ నుంచి తేరుకున్న ప్రముఖ సింగర్ ఆదిత్య నారాయణ్ వెంటనే స్టేజ్‌పైకి పరిగెత్తుకుంటూ వెళ్లి వ్యక్తిని పక్కకు లాగిపడేశాడు. అక్కడే ఉన్న మిగతా జడ్జెస్ కూడా షాకైపోయారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ ట్విటర్‌లో విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు ఆ రాజస్థానీ వ్యక్తి ప్రవర్తన పట్ల మండిపడ్డారు.


from https://ift.tt/31Hu8UL

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages