మనం ఇతరులకు ఏం బోధిస్తామో మనమూ అదే ఆచరించాలి. అంతేకానీ నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పి వెనక మనం చెడ్డ పనులు చేస్తే కుదరదు. చాలా మంది సెలబ్రిటీలు చేసే పని ఇదే. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఇదే సంఘటన ఎదురైంది. అసలేం జరిగిందంటే.. అమెరికాకు చెందిన ప్రముఖ క్లైమెట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్ ఇటీవల యూఎన్ క్లైమెట్ యాక్షన్ సమ్మిట్‌లో ప్రసంగించారు. ‘how dare you’ అంటూ గ్రెటా ఇచ్చిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మాతృభూమి కాలుష్యానికి అల్లాడిపోతోందంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఇక నుంచైనా అన్ని దేశాల నేతలు ఒక్కటై మాతృభూమిని కాపాడాలని కోరారు. హృదయాలను కదిలించిన ఈ ప్రసంగంతో గ్రెటా ఒక్కరోజులోనే పాపులర్ అయిపోయారు. గ్రెటాకు ఎందరో ప్రజలు, సెలబ్రిటీలు మద్దతు తెలిపారు. వారిలో కూడా ఉన్నారు. ‘ప్రస్తుతం అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని చెప్పి థ్యాంక్యూ గ్రెటా. మాతృభూమిని ఎలా కాపాడుకోవాలో మా తరాలకు వివరించినందుకు ధన్యవాదాలు. చివరికి మనకున్నది ఇదొక్క ప్లానెటే కదా..’ అని ట్వీట్ చేశారు. అయితే ప్రియాంక ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రియాంక వద్ద రోల్స్ రాయిస్ లాంటి ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటి వల్ల కూడా కాలుష్యం ఎక్కువవుతోంది కదా.. అని నెటిజన్లు ప్రియాంకను ప్రశ్నిస్తు్న్నారు. ‘ప్రియాంక.. మాతృభూమిని కాపాడటానికి నువ్వు నీ రోల్స్ రాయిస్‌ను అమ్మేయొచ్చు కదా..’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయమనే కాదు.. కొన్ని నెలల క్రితం ప్రియాంక తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని ఓ టీవీ కమర్షియల్ ద్వారా వెల్లడించారు. దీపావళి రోజులన టపాసులు పేల్చి కాలుష్యాన్ని రెట్టింపు చేయకండి తనను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి అని కోరారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ నిక్ జొనాస్‌తో తన పెళ్లి జరిగిన సందర్భంగా ప్రియాంక జోధ్‌పూర్ కోటలో టపాసులు పేల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి ప్రియంక సిగరెట్ తాగుతూ కనిపించారు. దాంతో ఆమె కేవలం ప్రకటన కోసమే ఆస్తమా ఉందని అబద్ధం చెప్పి ఉండొచ్చంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఓ పక్క స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి అని అడుగుతూనే మరోపక్క సిగరెట్ కాల్చడంలో అర్థమేంటని ప్రశ్నించారు.
from https://ift.tt/2lCTfsT
No comments:
Post a Comment