హీరోయిన్లు అమ్మల పాత్రల్లో నటించడానికే భయపడుతుంటారు. ఎక్కడ తమ కెరీర్ ఆ పాత్రలకే పరిమితం అయిపోతుందోనని. కానీ బాలీవుడ్ నటులు తాప్సి, భూమి పెడ్నేకర్ మాత్రం ఏకంగా 60 ఏళ్ల బామ్మల పాత్రల్లో నటించడానికి ముందుకొచ్చారు. అలా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందని సినిమాకు దర్శకత్వం వహించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మహిళా షార్ప్ షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సోమవారం సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌పై ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఈ సినిమా చిత్రబృందం చిక్కుల్లో పడింది. ‘నాకు తాప్సి, భూమి పెడ్నేకర్‌ల నటన నచ్చింది. కానీ అవి బామ్మల పాత్రలు కాబట్టి నీనా గుప్తా, రమ్యకృష్ణలను ఎంపిక చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది’ అని నెటిజన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు నీనా గుప్తా స్పందిస్తూ.. ‘నాకూ అదే అనిపించింది. కనీసం మా వయసుకు తగ్గ పాత్రల్లోనైనా మమ్మల్ని ఎంపిక చేసుకోండయ్యా’ అని మండిపడ్డారు. ఈ ట్వీట్ చూసిన మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ముందు ఈ సినిమా కంగన రనౌత్‌కు దక్కింది. కానీ ఆమె మిమ్మల్ని తీసుకోవాలని దర్శకుడికి చెప్పారు’ అని అన్నారు. ఈ ట్వీట్‌పై కంగన సోదరి రంగోలీ స్పందిస్తూ.. ‘నీనా జీ ముందు ఈ సినిమా ఆఫర్ కంగనకు వచ్చింది. కానీ మిమ్మల్ని కానీ రమ్యకృష్ణను కానీ తీసుకోవాల్సిందిగా కంగన కోరింది. కానీ ఇప్పటికీ బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకుల ఆలోచనలు ఇంకా మారలేదు. మిమ్మల్ని తీసుకుంటే ఎక్కడ సినిమా ఆడదోనని యువ నటీమణులకు అవకాశం ఇచ్చారు. వృద్ధుల పాత్రల్లో యువ నటీనటులను తీసుకుంటే మన భారతదేశ చిత్ర పరిశ్రమ ఇలాగే ఉంటుంది. ఫెమినిజం పేరుతో సెక్సిజంను ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్‌కు సిగ్గులేదు’ అని మండిపడ్డారు. నీనా గుప్తా, రంగోలీ ఇలా అనడంలో తప్పు లేదు. సినిమాలో నటించిన తాప్సి, భూమిలది కూడా తప్పు లేదు. ఎందుకంటే వారికి కాన్సెప్ట్ నచ్చి సినిమాకు ఒప్పుకున్నారు. ఇక్కడ తప్పంతా ‘సాండ్ కీ ఆంఖ్’ దర్శకుడు, నిర్మాతది. సినిమాలో బామ్మలదే ప్రధాన పాత్ర అయినప్పుడు వారి వయసువారినే తీసుకోవాలి కానీ హీరోయిన్లు ఎంపిక చేసుకోవడమేంటో. నిజానికి వారి పాత్రల్లో నీనా గుప్తా, రమ్యకృష్ణ నటించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. దీపావళికి విడుదల కానున్న ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోందో చూడాలి.
from https://ift.tt/2mmEvy6
No comments:
Post a Comment